Telugu Global
International

కోవిడ్-19 ఎదుర్కోవాలంటే సోషల్ వ్యాక్సినే మార్గం

దేశంలో తీవ్రంగా వ్యాపిస్తున్న కోవిడ్-19 నుంచి ప్రజలను రక్షించడానికి ‘సోషల్ వ్యాక్సిన్’ సరైన మార్గమని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు. దేశ వ్యాప్తంగా సేకరించిన 940 కోవిడ్ 19 శాంపిల్స్‌కు సంబంధించిన జీనోమ్ సీక్వెన్స్‌ను అద్యయనం చేశామని, ఇందులో ‘A2a’ వైరస్ అనేది చాలా ప్రమాదరకమైనదిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు ఇలాంటి ప్రమాదకరమైన వైరస్ ప్రబలి ఉంటుందని ఆయన […]

కోవిడ్-19 ఎదుర్కోవాలంటే సోషల్ వ్యాక్సినే మార్గం
X

దేశంలో తీవ్రంగా వ్యాపిస్తున్న కోవిడ్-19 నుంచి ప్రజలను రక్షించడానికి ‘సోషల్ వ్యాక్సిన్’ సరైన మార్గమని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు. దేశ వ్యాప్తంగా సేకరించిన 940 కోవిడ్ 19 శాంపిల్స్‌కు సంబంధించిన జీనోమ్ సీక్వెన్స్‌ను అద్యయనం చేశామని, ఇందులో ‘A2a’ వైరస్ అనేది చాలా ప్రమాదరకమైనదిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు ఇలాంటి ప్రమాదకరమైన వైరస్ ప్రబలి ఉంటుందని ఆయన అంచనావేశారు.

సీసీఎంబీ సేకరించిన శాంపిల్స్ గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషా, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్, తమిళనాడుకు చెందినవని.. ఇవన్నీ సింగిల్ స్ట్రెయిన్ (ఒకే బ్యాక్టీరియాను కలిగి ఉండటం) వైరస్‌లుగా గుర్తించినట్లు తెలిపారు. ఆ 940 శాంపిల్స్‌లో 90 శాతం ఒకే రకమైన వైరస్ కలిగి ఉంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ ఒకే రకమైనదని.. దీని జీనోమ్‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయన్న వాదన తప్పని తేలినట్లు రాకేష్ మిశ్రా స్పష్టం చేశారు.

జీనోమ్‌లో మార్పులు జరగడం లేదంటే.. వ్యాక్సిన్, ఔషధాలు రూపొందించడం చాలా సులభమని ఆయన చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్ తయారీకి చాలా సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు ‘సోషల్ వ్యాక్సిన్’ ద్వారా ప్రజలు కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చని ఆయన తెలిపారు.

సోషల్ వ్యాక్సిన్ అంటే అదేమీ ప్రత్యేకమైన డ్రగ్ కాదు. ప్రతీ ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించడం, చేతులను తరచుగా కడుక్కోవడం, మాస్కులు ధరించి, వ్యక్తిగత దూరం పాటించడం వల్ల కరోనా నుంచి కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఈ విషయాలను విస్తృతంగా ప్రకటించడాన్నే ‘సోషల్ వ్యాక్సిన్’ అంటారు.

తెలంగాణతోపాటు మొత్తం దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. తద్వారా వైరస్ లక్షణాలు లేని వారిని త్వరగా గుర్తించొచ్చన్నారు. మనం ఇప్పుడు కఠిన పరిస్థితుల్లో ఉన్నామని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున శాంపిల్స్‌ను సేకరించాల్సి ఉందని, తాము కనీసం నాలుగైదు నెలలు శ్రమించాల్సి ఉంటుందని రాకేశ్ మిశ్రా వివరించారు.

గతంలొ విధించిన లాక్‌డౌన్ కారణంగా దేశంలో వైరస్ వ్యాప్తిని నెమ్మదింప చేయగలిగామని, దీని వల్ల వ్యాధి బారిన పడే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆయన చెప్పారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ‘సోషల్ వ్యాక్సిన్’ అమలు చేయగలిగితే మరింత లాభం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

First Published:  6 July 2020 6:46 AM GMT
Next Story