Telugu Global
National

అనర్హత వేటు పడకుండా కాపాడండి " హైకోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణంరాజు

కొంతకాలంగా వైసీపీతో గేమ్స్ ఆడుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.  రఘురామకృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు వైసీపీ ఎంపీల బృందం ఢిల్లీ వెళ్ళింది. దీంతో రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు వేయకుండా, సస్పెన్షన్ వేటు వేయకుండా కాపాడాలంటూ కోర్టును కోరారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాను యువజన రైతు శ్రామిక పార్టీ తరపున ఎన్నికయ్యానని… కానీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్‌హెడ్‌పై షోకాజ్ […]

అనర్హత వేటు పడకుండా  కాపాడండి  హైకోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణంరాజు
X

కొంతకాలంగా వైసీపీతో గేమ్స్ ఆడుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. రఘురామకృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలంటూ
లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు వైసీపీ ఎంపీల బృందం ఢిల్లీ వెళ్ళింది.

దీంతో రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు వేయకుండా, సస్పెన్షన్ వేటు వేయకుండా కాపాడాలంటూ కోర్టును కోరారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.

తాను యువజన రైతు శ్రామిక పార్టీ తరపున ఎన్నికయ్యానని… కానీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్‌హెడ్‌పై షోకాజ్ ఇచ్చారని… ఇది చెల్లదని పిటిషన్‌లో వివరించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశానని… ఈసీ నిర్ణయం తీసుకునే వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని హైకోర్టును రఘురామకృష్ణంరాజు వేడుకున్నారు.

హైకోర్టులో పలువురు కరోనా బారినపడడంతో అత్యవసర కేసులను మాత్రమే కోర్టు విచారిస్తోంది. రఘురామ కృష్ణంరాజు పిటిషన్‌ సోమవారం విచారణకు రావొచ్చు అంటున్నారు. వైసీపీ తనపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా తనకు ఏమీ కాదని చెబుతూ వచ్చిన రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అన్న పదం చెల్లదంటూ రఘురామ కృష్ణంరాజు హడావుడి చేస్తున్ననేపథ్యంలో… వైసీపీ నెటిజన్లు కొందరు కొత్తగా ఆయన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రకటనను తెరపైకి తెచ్చింది. ఫ్యాన్‌ గుర్తుపై ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని… ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు.

First Published:  3 July 2020 1:53 AM GMT
Next Story