Telugu Global
NEWS

అచ్చెంకు చుక్కెదురు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈనెల ఒకటోతేదీన బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. పోలీసు కస్టడీ ముగిసినందున బెయిల్ ఇవ్వాలని అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది వాదించారు. అచ్చెన్నాయుడు ఆరోగ్యం కూడా సరిగాలేదన్నారు. అయితే అచ్చెన్నాయుడు తరపు లాయర్ల వాదనను ఏసీబీ లాయర్లు తోసి పుచ్చారు. అచ్చెన్నాయుడు విచారణలో ఏమాత్రం సహకరించలేదని వివరించారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని… మరిన్ని విషయాలు రాబట్టాల్సి ఉందని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులోఉండగా బెయిల్ […]

అచ్చెంకు చుక్కెదురు
X

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈనెల ఒకటోతేదీన బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. పోలీసు కస్టడీ ముగిసినందున బెయిల్ ఇవ్వాలని అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది వాదించారు. అచ్చెన్నాయుడు ఆరోగ్యం కూడా సరిగాలేదన్నారు.

అయితే అచ్చెన్నాయుడు తరపు లాయర్ల వాదనను ఏసీబీ లాయర్లు తోసి పుచ్చారు. అచ్చెన్నాయుడు విచారణలో ఏమాత్రం సహకరించలేదని వివరించారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని… మరిన్ని విషయాలు రాబట్టాల్సి ఉందని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులోఉండగా బెయిల్ ఇస్తే సాక్ష్యులను అచ్చెన్నాయుడు ప్రభావితం చేస్తారని ప్రభుత్వ లాయర్లు వాదించారు. ఒకటో తేదీ వాదనలు విన్న కోర్టు నేడు తీర్పు ఇచ్చింది. అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.

అటు అచ్చెన్నాయుడు తరపున లాయర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. అచ్చెన్నాయుడిని జైలులో ఉంచవద్దని.. ఆయన ఆరోగ్యం బాగోలేదన్నందు కార్పొరేట్ ఆస్పత్రికి తరలించేందుకు అవకాశం ఇవ్వాలని హైకోర్టులో అచ్చెన్నాయుడు లాయర్లు వాదించారు.

ఇందుకు ప్రభుత్వ లాయర్లు అభ్యంతరం తెలిపారు. అచ్చెన్నాయుడికి రెండు వారాలకుపైగా గుంటూరు జీజీహెచ్‌లో మెరుగైన వైద్యం అందించారని… వైద్యుల సిఫార్సు మేరకు డిశ్చార్జ్ చేసి జైలుకు తరలించినట్టు వాదించారు. అచ్చెన్నాయుడిని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించే అంశంలో తీర్పును హైకోర్టు వాయిదా వేసింది.

First Published:  3 July 2020 7:16 AM GMT
Next Story