Telugu Global
CRIME

యూపీలో డీఎస్పీతో సహా 8మంది పోలీసులను కాల్చి చంపిన రౌడీషీటర్లు

శాంతిభద్రతల సవాళ్లు అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్‌లో మరోసారి రౌడీషీటర్లు రెచ్చిపోయారు. ఏకంగా ఎనిమిది మంది పోలీసులను రౌడీ షీటర్లు కాల్చి చంపేశారు. చనిపోయిన పోలీసుల్లో ఒక డీఎస్పీ కూడా ఉన్నారు. కాన్పూరు సమీపంలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. రౌడీషీటర్ల కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. నగర శివారులోని బిక్రూ గ్రామంలో రౌడీషీటర్‌ వికాస్ దూబే ఉన్నారన్న సమాచారంతో పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. పోలీసులను చూడగానే రౌడీషీటర్‌ గ్యాంగ్ కాల్పులు […]

యూపీలో డీఎస్పీతో సహా 8మంది పోలీసులను కాల్చి చంపిన రౌడీషీటర్లు
X

శాంతిభద్రతల సవాళ్లు అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్‌లో మరోసారి రౌడీషీటర్లు రెచ్చిపోయారు. ఏకంగా ఎనిమిది మంది పోలీసులను రౌడీ షీటర్లు కాల్చి చంపేశారు. చనిపోయిన పోలీసుల్లో ఒక డీఎస్పీ కూడా ఉన్నారు. కాన్పూరు సమీపంలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

రౌడీషీటర్ల కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. నగర శివారులోని బిక్రూ గ్రామంలో రౌడీషీటర్‌ వికాస్ దూబే ఉన్నారన్న సమాచారంతో పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. పోలీసులను చూడగానే రౌడీషీటర్‌ గ్యాంగ్ కాల్పులు మొదలుపెట్టింది. దాంతో డీఎస్పీ, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై డీజీపీతో మాట్లాడారు. రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రౌడీషీటర్లను పట్టుకునునేందుకు భారీగా పోలీసులు రంగంలోకి దిగారు. కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

బీజేపీకి చెందిన మంత్రి సంతోష్ శుక్లా హత్యతో సహా రౌడీషీటర్‌ వికాస్‌ దూబేపై 57 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 2001లో శివలి పోలీస్ స్టేషన్‌లో సంతోష్ శుక్లాను హత్య చేసినట్లు దుబేపై ఆరోపణలు ఉన్నాయి. గతంలో రాజ్‌నాథ్ సింగ్ కేబినెట్‌లో శుక్లా మంత్రిగా పనిచేశారు.

First Published:  2 July 2020 10:24 PM GMT
Next Story