Telugu Global
NEWS

తెలంగాణలో కరోనా పరీక్షల నిలుపుదలపై హైకోర్టు తీవ్రవ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలను తెలంగాణలో నిలిపివేయడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పదేపదే ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని మండిపడింది. అసలు రాష్ట్రంలో అమలు అవుతున్న కంటైన్‌మెంట్ విధానం ఏంటో స్పష్టం చేయాలని ఆదేశించింది. గతంలో 50వేల కరోనా పరీక్షలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ దిశగా […]

తెలంగాణలో కరోనా పరీక్షల నిలుపుదలపై హైకోర్టు తీవ్రవ్యాఖ్యలు
X

తెలంగాణ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలను తెలంగాణలో నిలిపివేయడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పదేపదే ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని మండిపడింది.

అసలు రాష్ట్రంలో అమలు అవుతున్న కంటైన్‌మెంట్ విధానం ఏంటో స్పష్టం చేయాలని ఆదేశించింది. గతంలో 50వేల కరోనా పరీక్షలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించింది. జీవించే హక్కును కాలరాస్తోందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఐసీఎంఆర్‌ నిబంధనలకు విరుద్దంగా పీహెచ్‌ డైరెక్టర్ ఎలా ఉత్తర్వులు ఇస్తారని హైకోర్టు నిలదీసింది. తెలంగాణలో 20 రోజలుగా జరిగిన పరీక్షల వివరాలను అందజేయాలని ఆదేశించింది. కరోనా బులిటెన్‌లో వివరాలు అరకొరగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

జులై 17లోగా సంతృప్తికరమైన సమాధానం చెప్పకపోతే 20వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ డైరెక్టర్ తదితరులు కోర్టుకు నేరుగా హాజరుకావాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. పదినిమిషాల్లో ఫలితాలు వచ్చేలా పరీక్షలు ఎందుకు నిర్వహించలేకపోతున్నారని ప్రశ్నించింది.

ఇటీవల కేంద్ర బృంద పర్యటనకు సంబంధించిన వివరాలతో పాటు, పరీక్షలు ఎందుకు నిలిపివేయాల్సి వచ్చింది… సిబ్బందికి ఇచ్చిన పీపీఈ కిట్ల వివరాలను కూడా అందజేయాలని ఆదేశించింది.

First Published:  1 July 2020 7:30 AM GMT
Next Story