Telugu Global
Cinema & Entertainment

రద్దు వైపే మొగ్గుచూపిన రాజమౌళి

లెక్కప్రకారం ఇవాళ్టి నుంచి ఆర్ఆర్ఆర్ ట్రయల్ షూట్ ప్రారంభం కావాలి. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. హైదరాబాద్ శివార్లలోని గండిపేటలో ట్రయల్ షూట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కానీ ఆఖరి నిమిషంలో రాజమౌళి సినిమా షూటింగ్ ను రద్దుచేశాడు. రాజమౌళి ఇలా చేయడం ఇది వరుసగా రెండో సారి. హైదరాబాద్ లో పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పైగా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడిప్పుడే వ్యక్తులకు కరోనా సోకుతోంది. అటు […]

రద్దు వైపే మొగ్గుచూపిన రాజమౌళి
X

లెక్కప్రకారం ఇవాళ్టి నుంచి ఆర్ఆర్ఆర్ ట్రయల్ షూట్ ప్రారంభం కావాలి. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. హైదరాబాద్ శివార్లలోని గండిపేటలో ట్రయల్ షూట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కానీ ఆఖరి నిమిషంలో రాజమౌళి సినిమా షూటింగ్ ను రద్దుచేశాడు. రాజమౌళి ఇలా చేయడం ఇది వరుసగా రెండో సారి.

హైదరాబాద్ లో పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పైగా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడిప్పుడే వ్యక్తులకు కరోనా సోకుతోంది. అటు టెలివిజన్ రంగంలోని నటీనటులకు కూడా కరోనా వస్తోంది. దీంతో రిస్క్ తీసుకోవడం ఇష్టంలేక ఆర్ఆర్ఆర్ ట్రయల్ షూట్ ను రద్దుచేశాడు రాజమౌళి.

మరోవైపు ఈ ట్రయల్ షూట్ ను రద్దుచేయడానికి మరో కారణం కూడా చెబుతున్నారు యూనిట్ లోని సభ్యులు. ప్రభుత్వం చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం ఆర్ఆర్ఆర్ షూటింగ్ చేయడం కష్టమని అంతా డిసైడ్ అయ్యారట. తక్కువ సిబ్బందితో ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమాను పూర్తిచేయడం కష్టమని భావించారట.

ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ఆర్ఆర్ఆర్ ట్రయల్ షూట్ ను రద్దుచేశారు. ఇకపై ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఎలాంటి ట్రయల్ షూట్ ఉండదని కూడా రాజమౌళి స్పష్టంచేసినట్టు తెలుస్తోంది.

పరిస్థితులన్నీ అనుకూలించి, పూర్తి సిబ్బందితో పనిచేయడానికి ప్రభుత్వం ఎప్పుడైతే అనుమతి ఇస్తుందో అప్పుడు మాత్రమే సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని జక్కన్న నిర్ణయించాడు.

First Published:  25 Jun 2020 1:00 AM GMT
Next Story