Telugu Global
Cinema & Entertainment

శింబు-హన్సిక ఫొటో వైరల్

హీరో శింబు, హీరోయిన్ హన్సిక ఎఫైర్ గురించి అందరికీ తెలిసిందే. గతంలో వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి వరకు వెళ్లారు. అంతలోనే విడిపోయారు. అలా విడిపోయిన తర్వాత ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. కలిసి సినిమా కూడా చేయలేదు. అలా లాంగ్ గ్యాప్ తర్వాత హన్సిక, శింబు మరోసారి కలిశారు. వీళ్లిద్దరూ కలిసి మహా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో స్టిల్ రిలీజ్ చేశారు. ఆ స్టిల్ లో హన్సిక-శింబు కౌగిలించుకొని ఉన్నారు. ఈ […]

శింబు-హన్సిక ఫొటో వైరల్
X

హీరో శింబు, హీరోయిన్ హన్సిక ఎఫైర్ గురించి అందరికీ తెలిసిందే. గతంలో వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి వరకు వెళ్లారు. అంతలోనే విడిపోయారు. అలా విడిపోయిన తర్వాత ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. కలిసి సినిమా కూడా చేయలేదు. అలా లాంగ్ గ్యాప్ తర్వాత హన్సిక, శింబు మరోసారి కలిశారు. వీళ్లిద్దరూ కలిసి మహా అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో స్టిల్ రిలీజ్ చేశారు. ఆ స్టిల్ లో హన్సిక-శింబు కౌగిలించుకొని ఉన్నారు. ఈ ఒక్క ఫొటోతో అప్పటి పాత రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు కోలీవుడ్ జనాలు. గతంలో ఓ పబ్ లో సరిగ్గా ఇలానే ఫొటో దిగారు హన్సిక-శింబు. ఇప్పుడు మరోసారి ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసేలా ఈ స్టిల్ ను రిలీజ్ చేశారు.

మహా సినిమాలో హన్సిక హీరోయిన్. కానీ హీరో మాత్రం శింబు కాదు. కేవలం అతడిది అతిథి పాత్ర మాత్రమే. కానీ సినిమాకు మరింత ప్రచారం కల్పించడం కోసం మేకర్స్ ఇలా హన్సిక-శింబు ఫొటోల్ని కావాలనే బయటకు వదుల్తున్నారు.

First Published:  23 Jun 2020 9:16 AM GMT
Next Story