Telugu Global
NEWS

ఏపీలో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌...

తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇప్పుడు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, గణేష్‌ గుప్తా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్‌ నేత విహెచ్‌ కూడా కరోనాతో ఆపోలో ఆసుపత్రిలో చేరారు. ఏపీలో తొలిసారిగా ఓ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా‌ తేలింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. […]

ఏపీలో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌...
X

తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇప్పుడు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, గణేష్‌ గుప్తా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్‌ నేత విహెచ్‌ కూడా కరోనాతో ఆపోలో ఆసుపత్రిలో చేరారు.

ఏపీలో తొలిసారిగా ఓ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా‌ తేలింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో ఆందోళన మొదలైంది. ఏపీలో తొలిసారి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే ఆయనకు ర్యాపిడ్‌ పరీక్ష పాజిటివ్‌ వచ్చింది. స్వాబ్‌ టెస్ట్‌లో కూడా పాజిటివ్‌ వస్తే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఇటీవలే అమెరికా వెళ్లివచ్చారు. అప్పటి నుంచి ఆయన హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు కరోనా లక్షణాలు ఉండటంతో విజయనగరం జిల్లా వైద్యాధికారులు ట్రూనాట్‌తో పరీక్షలు చేశారు. పాజిటివ్‌ వచ్చింది. ఆర్డీ ఆర్పీ రిపోర్టు రావాల్సి ఉంది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే ఐసోలేట్ అయినట్లు సమాచారం.

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఓటు వేశారు. దీంతో ఇప్పుడు అసెంబ్లీలో ఆయనతో సన్నిహితంగా తిరిగిన వారిలో టెన్షన్‌ నెలకొంది. ఒకప్పుడు విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు బయటి నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా కేసులు నమోదు అవుతున్నాయి.

First Published:  22 Jun 2020 8:50 PM GMT
Next Story