Telugu Global
NEWS

వీహెచ్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గత వారం రోజులుగా టెస్టుల సంఖ్య పెంచడంతో కరోనా పాజిటివ్‌ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అంతే కాకుండా ఏకంగా ఎమ్మెల్యేలు, వారి వ్యక్తిగత సిబ్బంధికి కరోనా సోకుతుండటం ఆందోళనకరంగా మారింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంతరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత రెండు రోజులుగా అస్వస్థతకు గురైన వీహెచ్ బంజారాహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు […]

వీహెచ్‌కు కరోనా పాజిటివ్
X

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గత వారం రోజులుగా టెస్టుల సంఖ్య పెంచడంతో కరోనా పాజిటివ్‌ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అంతే కాకుండా ఏకంగా ఎమ్మెల్యేలు, వారి వ్యక్తిగత సిబ్బంధికి కరోనా సోకుతుండటం ఆందోళనకరంగా మారింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంతరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.

గత రెండు రోజులుగా అస్వస్థతకు గురైన వీహెచ్ బంజారాహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో వీహెచ్‌కు అపోలో ఆస్పత్రిలోనే వైద్యం అందిస్తున్నారు. కాగా, అంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన గూడూరు నారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఆయన చికిత్స పొందుతున్నారు.

అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో వరుసగా ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతుండటంతో పలువురు ఆందోళన చెందుతున్నారు.

First Published:  21 Jun 2020 5:48 AM GMT
Next Story