Telugu Global
NEWS

అశోక్‌బాబు ఒక వృద్ధ నారీ పతివ్రత... ఇలాంటి బఫూన్‌గాళ్లను చర్చకు పిలవొద్దు

టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆడమగ కానీ రాజకీయాలు చేస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విరుచుకుపడ్డారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నానని … తన మొగతనం ఏంటో గన్నవరం నియోజకవర్గం, విజయవాడ పార్లమెంట్ చూసిందన్నారు. అశోక్‌బాబుకు ప్రత్యేకంగా మగతనం చూపించాలంటే సిద్ధమన్నారు. ఒక రిటైర్‌ అయిన ఉద్యోగి మాట్లాడేటప్పుడు ఒళ్లు, నోరు దగ్గరపెట్టుకుని మాట్లాడాలన్నారు. అశోక్‌బాబు టీడీపీలోకి ఎప్పుడొచ్చారని ప్రశ్నించారు. టీడీపీకి తాము గతంలో ఎంత […]

అశోక్‌బాబు ఒక వృద్ధ నారీ పతివ్రత... ఇలాంటి బఫూన్‌గాళ్లను చర్చకు పిలవొద్దు
X

టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆడమగ కానీ రాజకీయాలు చేస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విరుచుకుపడ్డారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు.

2004 నుంచి రాజకీయాల్లో ఉన్నానని … తన మొగతనం ఏంటో గన్నవరం నియోజకవర్గం, విజయవాడ పార్లమెంట్ చూసిందన్నారు. అశోక్‌బాబుకు ప్రత్యేకంగా మగతనం చూపించాలంటే సిద్ధమన్నారు.

ఒక రిటైర్‌ అయిన ఉద్యోగి మాట్లాడేటప్పుడు ఒళ్లు, నోరు దగ్గరపెట్టుకుని మాట్లాడాలన్నారు. అశోక్‌బాబు టీడీపీలోకి ఎప్పుడొచ్చారని ప్రశ్నించారు. టీడీపీకి తాము గతంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టామో తెలుసా అని వ్యాఖ్యానించారు.

ఉద్యోగం అయిపోయాక వచ్చి వృద్థ నారీ పతివ్రతలా అశోక్‌బాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒళ్లు కొవ్వెక్కి మగతనం అని మాట్లాడితే మర్యాదగా ఉండదన్నారు. ఉద్యోగ సంఘం నాయకుడిగా ముసుగేసుకుని ఉద్యోగులను ఎలా మోసం చేశారన్నది అందరికీ తెలుసన్నారు. అశోక్‌బాబు లాంటి పకోడిగాళ్లను, బఫూన్‌గాళ్లను చర్చలకు పిలవడం టీవీ చానళ్లు మానుకోవాలని సూచించారు.

టీడీపీ నాయకత్వమే తనను సస్పెండ్ చేసిందని… మరి ఇప్పుడు ఓటు వేయాల్సిందిగా ఎలా అడుగుతారని ప్రశ్నించారు. మగతనం చూడాలనుకుంటే టీవీలో కాకుండా ఓటేసేందుకు వచ్చినప్పుడు అసెంబ్లీ వద్దే నిలదీసి ఉంటే అశోక్‌బాబుకు మగతనం ఏమిటో చూపించేవాడినన్నారు.

2014లో టీడీపీని గెలిపించానంటున్న అశోక్‌బాబు ఇప్పుడు టీడీపీని లేపి చూపించాలని సవాల్ చేశారు. వనజాక్షి విషయంలో తాను లేకుంటే చింతమనేని ప్రభాకర్ పీక మీదకు వచ్చేదని వంశీ వ్యాఖ్యానించారు.

First Published:  19 Jun 2020 11:54 PM GMT
Next Story