Telugu Global
Cinema & Entertainment

అలియా, సల్మాన్ అలా బుక్కయ్యారు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో నెపొటిజంపై బాలీవుడ్ లో భారీ ఎత్తున చర్చ మొదలైంది. కొంతమమంది బాలీవుడ్ హీరోలు, కుటుంబాలు కలిసి సుశాంత్ ను తొక్కేశారనే విషయం, సాక్ష్యాలతో పాటు బయటకు రావడంతో అంతా భగ్గుమంటున్నారు. ఇప్పుడీ సెగ అలియా భట్, సల్మాన్ ఖాన్ కు గట్టిగానే తగిలింది. సుశాంత్ మరణంతో మరోసారి సల్మాన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చెలరేగాయి. సల్మాన్ తో దబంగ్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన అభినవ్ కశ్యప్ ఆరోపణలు చేశాడు. […]

అలియా, సల్మాన్ అలా బుక్కయ్యారు
X

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో నెపొటిజంపై బాలీవుడ్ లో భారీ ఎత్తున చర్చ మొదలైంది. కొంతమమంది బాలీవుడ్ హీరోలు, కుటుంబాలు కలిసి సుశాంత్ ను తొక్కేశారనే విషయం, సాక్ష్యాలతో పాటు బయటకు రావడంతో అంతా భగ్గుమంటున్నారు. ఇప్పుడీ సెగ అలియా భట్, సల్మాన్ ఖాన్ కు గట్టిగానే తగిలింది.

సుశాంత్ మరణంతో మరోసారి సల్మాన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చెలరేగాయి. సల్మాన్ తో దబంగ్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన అభినవ్ కశ్యప్ ఆరోపణలు చేశాడు. దబంగ్ తర్వాత సల్మాన్ తనను తొక్కేశాడని విమర్శించాడు. ప్రూఫ్స్ కూడా బయటపెట్టాడు. అటు ఆత్మహత్య చేసుకున్న జియాఖాన్ తల్లి కూడా సల్మాన్ పై విమర్శలు గుప్పించింది. జియాఖాన్ కేసు నుంచి సూరజ్ ను సల్మాన్ ఖాన్ తప్పించాడని ఆరోపించింది.

మరోవైపు అలియాభట్ పై కూడా సుశాంత్ సింగ్ ఎఫెక్ట్ గట్టిగా పడింది. నెపొటిజంను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతున్న వేళ.. పెద్ద కుటుంబాలు, పెద్ద హీరోలకు అమాంతం ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. వీళ్లలో అందరికంటే ముందుంది అలియాభట్. ఈమె సోషల్ మీడియా ఎకౌంట్ నుంచి అమాంతం 5 లక్షల మంది తప్పుకున్నారు. ఒక్కసారి ఇంతమంది తనను అన్-ఫాలో చేయడంతో అలియా షాక్ అయింది.

First Published:  20 Jun 2020 12:00 AM GMT
Next Story