Telugu Global
NEWS

జగన్‌కు అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్ ఫోన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి కేంద్ర మంత్రులు ఫోన్ చేశారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది. ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్‌ సింగ్‌ లు ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర పెద్దలు పలు రాజకీయ పార్టీలతో మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి […]

జగన్‌కు అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్ ఫోన్
X

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి కేంద్ర మంత్రులు ఫోన్ చేశారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది. ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్‌ సింగ్‌ లు ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతుంది.

ఈ నేపథ్యంలో కేంద్ర పెద్దలు పలు రాజకీయ పార్టీలతో మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు.

దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తాము పూర్తి మద్దతుగా ఉంటామని కేంద్రమంత్రులతో జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో జరిగే అఖిలపక్ష భేటీలో… వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు.

First Published:  18 Jun 2020 8:38 AM GMT
Next Story