Telugu Global
Cinema & Entertainment

త్రిషపై కోలీవుడ్ లో హాట్ చర్చ

15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది త్రిష. అయినప్పటికీ ఇప్పటికీ ఆమె ఎంతో హాట్. ఆమెకు సంబంధించిన విషయాలు ఇంకెంతో హాట్. ఇప్పుడు మరోసారి కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది త్రిష. కేవలం కోలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో కూడా త్రిషపై చిన్నపాటి చర్చ మొదలైంది. దీనికి కారణం ఆమె సోషల్ మీడియా నుంచి తప్పుకోవడమే. ఇదేదో సడెన్ గా జరిగిన వ్యవహారం కాదు. తను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నానని, కొన్నాళ్ల పాటు […]

త్రిషపై కోలీవుడ్ లో హాట్ చర్చ
X

15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది త్రిష. అయినప్పటికీ ఇప్పటికీ ఆమె ఎంతో హాట్. ఆమెకు సంబంధించిన విషయాలు ఇంకెంతో హాట్. ఇప్పుడు మరోసారి కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది త్రిష. కేవలం కోలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో కూడా త్రిషపై చిన్నపాటి చర్చ మొదలైంది. దీనికి కారణం ఆమె సోషల్ మీడియా నుంచి తప్పుకోవడమే.

ఇదేదో సడెన్ గా జరిగిన వ్యవహారం కాదు. తను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నానని, కొన్నాళ్ల పాటు వీటికి దూరంగా ఉంటానని ప్రకటించి మరీ గ్యాప్ తీసుకుంది త్రిష. సరిగ్గా ఇక్కడే జనాలకు అనుమానాలు పెరిగిపోయాయి.

చాన్నాళ్లుగా త్రిష పెళ్లిపై చర్చ నడుస్తోంది. ఈ ఏడాది కూడా ఆమె పెళ్లిపై ఊహాగానాలు చెలరేగాయి. మరీ ముఖ్యంగా త్రిష బెస్ట్ ఫ్రెండ్ రానా ఓ ఇంటివాడు కాబోతున్న నేపథ్యంలో.. త్రిష కూడా పెళ్లి చేసుకుంటుందని కొంతమంది భావిస్తున్నారు. దీనికోసమే ఆమె కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరమైందని చెబుతున్నారు.

త్రిష మాత్రం కేవలం ప్రశాంతత కోసమే సోషల్ మీడియాకు దూరం అవుతున్నట్టు ప్రకటించి తప్పుకుంది. 13వ తేదీ నుంచి ట్విట్టర్ లో ఆమె అప్ డేట్స్ లేవు. అటు ఇనస్టాగ్రామ్ లో అంతకంటే ముందే త్రిష అప్ డేట్స్ ఇవ్వడం ఆపేసింది.

First Published:  17 Jun 2020 10:18 AM GMT
Next Story