Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ నరకం అంటున్న హీరోయిన్

సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో బాలీవుడ్ చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై నటి కంగనా రనౌత్ విరుచుకుపడింది. సుశాంత్ కు బాలీవుడ్ సపోర్ట్ ఇవ్వలేదని ఆరోపించింది. మరోవైపు శ్రద్ధాదాస్ కూడా నటీనటుల కష్టాల్ని ఏకరువు పెట్టింది. ఆదాయం కంటే మెయింటెనెన్స్ కే ఎక్కువ ఖర్చు అవుతుందని వాపోయింది. ఇప్పుడీ లిస్ట్ లోకి పాయల్ ఘోష్ కూడా చేరింది. బాలీవుడ్ అరాచకాలపై ఉన్నది ఉన్నట్టుగా స్పందించింది ఈ బ్యూటీ. సౌత్ ఇండస్ట్రీతో పోలిస్తే బాలీవుడ్ నరకం […]

బాలీవుడ్ నరకం అంటున్న హీరోయిన్
X

సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో బాలీవుడ్ చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై నటి కంగనా రనౌత్ విరుచుకుపడింది. సుశాంత్ కు బాలీవుడ్ సపోర్ట్ ఇవ్వలేదని ఆరోపించింది. మరోవైపు శ్రద్ధాదాస్ కూడా నటీనటుల కష్టాల్ని ఏకరువు పెట్టింది. ఆదాయం కంటే మెయింటెనెన్స్ కే ఎక్కువ ఖర్చు అవుతుందని వాపోయింది. ఇప్పుడీ లిస్ట్ లోకి పాయల్ ఘోష్ కూడా చేరింది. బాలీవుడ్ అరాచకాలపై ఉన్నది ఉన్నట్టుగా స్పందించింది ఈ బ్యూటీ.

సౌత్ ఇండస్ట్రీతో పోలిస్తే బాలీవుడ్ నరకం అంటోంది పాయల్ ఘోష్. సౌత్ లో హీరోయిన్లకు గుళ్లు కట్టి మరీ గౌరవిస్తారని, బాలీవుడ్ లో మాత్రం చచ్చేంతవరకు అవమానిస్తూనే ఉంటారని కామెంట్ చేసింది. అంతేకాదు.. సౌత్ నుంచి వచ్చిన నటీనటులంటే బాలీవుడ్ లో చాలా చిన్నచూపు ఉందని అంటోంది ఈ బ్యూటీ.

బాలీవుడ్ లో వర్గాలు, రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని.. కేవలం కొంతమందికి మాత్రమే యాక్సెస్ ఉంటుందని చెబుతోంది పాయల్ ఘోష్. చివరికి చిన్న చిన్న పార్టీలకు కూడా ఆహ్వానాలు అందవని, మానసికంగా బాగా దెబ్బతీస్తారని చెబుతోంది.

First Published:  16 Jun 2020 10:30 PM GMT
Next Story