Telugu Global
CRIME

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని వేదాద్రి వద్ద ట్రాక్టర్-లారీ ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందగా మరో 14 మంది గాయపడ్డారు. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా.. మరో ఇద్దు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరం గ్రామానికి చెందిన దాదాపు 30 మంది వేదాద్రిలోని లక్ష్మీనరసింహ స్వామి […]

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం
X

ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని వేదాద్రి వద్ద ట్రాక్టర్-లారీ ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందగా మరో 14 మంది గాయపడ్డారు. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా.. మరో ఇద్దు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరం గ్రామానికి చెందిన దాదాపు 30 మంది వేదాద్రిలోని లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి ఒక ట్రాక్టర్‌లో వెళ్లారు. దర్శనానంతరం తిరిగి వస్తుండగా.. ఎదురుగా వేగంగా వచ్చిన సిమెంట్ లారీ ట్రాక్టర్‌ను ఢీకొంది. వెంటనే ట్రాక్టర్ పల్టీ కొట్టింది.

ఘటన జరిగిన ప్రదేశంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ కూడా క్యాబిన్‌లో ఇరుక్కున్నట్లు సమాచారం. చికిత్స పొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.

Next Story