Telugu Global
Cinema & Entertainment

ఆ పుకారులో నిజం లేదు

“పూజా హెగ్డే క్లాసికల్ డాన్సర్ గా మారింది. త్వరలోనే తన డాన్సింగ్ మొత్తం సిల్వర్ స్క్రీన్ చూపించబోతోంది. దీనికోసం ఆమె 3 నెలల కిందటే ఫుల్ గా ట్రయినింగ్ తీసుకుంది.” ప్రభాస్ సినిమాలో పూజా హెగ్డే పాత్రకు సంబంధించి ఇలా 2 రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఎన్నడూలేని విధంగా ఈ పుకార్లపై మాత్రం యూనిట్ స్పందించింది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే క్లాసికల్ డాన్సర్ […]

ఆ పుకారులో నిజం లేదు
X

“పూజా హెగ్డే క్లాసికల్ డాన్సర్ గా మారింది. త్వరలోనే తన డాన్సింగ్ మొత్తం సిల్వర్ స్క్రీన్ చూపించబోతోంది. దీనికోసం ఆమె 3 నెలల కిందటే ఫుల్ గా ట్రయినింగ్ తీసుకుంది.”

ప్రభాస్ సినిమాలో పూజా హెగ్డే పాత్రకు సంబంధించి ఇలా 2 రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఎన్నడూలేని విధంగా ఈ పుకార్లపై మాత్రం యూనిట్ స్పందించింది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే క్లాసికల్ డాన్సర్ కాదని ప్రకటించింది.

యూరోప్ బ్యాక్ డ్రాప్ లో 1960ల నాటి కథతో వస్తోంది ప్రభాస్ మూవీ. ఇందులో ప్రభాస్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. కథకు తగ్గట్టు పూజా హెగ్డే కూడా 2 విభిన్న పాత్రల్లో కనిపించనుంది. అయితే క్లాసికల్ డాన్సర్ పాత్ర మాత్రం కాదంటోంది యూనిట్.

మరోవైపు ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని ఈ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకు రాథేశ్యామ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

First Published:  15 Jun 2020 11:00 PM GMT
Next Story