Telugu Global
NEWS

తెలంగాణ ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ధరలు ఖరారు

తెలంగాణలో రోజు రోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రైవేటులో కూడా వైద్యానికి ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కరోనా కేసులు నమోదైనా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రైవేటులో కూడా చికిత్సకు అనుమతించాలని కోరడంతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, ప్రైవేటులో కరోనా చికిత్సకు అనుమతులు ఇచ్చిన తర్వాత కొన్ని ఆసుపత్రులు భారీగా ఫీజులు పెంచాయి. కరోనా పేషెంటుకు చికిత్స అందించడానికి రూ. లక్షల్లో ఖర్చు అవుతోంది. దీనికి […]

తెలంగాణ ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ధరలు ఖరారు
X

తెలంగాణలో రోజు రోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రైవేటులో కూడా వైద్యానికి ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కరోనా కేసులు నమోదైనా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రైవేటులో కూడా చికిత్సకు అనుమతించాలని కోరడంతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కాగా, ప్రైవేటులో కరోనా చికిత్సకు అనుమతులు ఇచ్చిన తర్వాత కొన్ని ఆసుపత్రులు భారీగా ఫీజులు పెంచాయి. కరోనా పేషెంటుకు చికిత్స అందించడానికి రూ. లక్షల్లో ఖర్చు అవుతోంది. దీనికి సామాన్యులే కాకుండా డబ్బున్న వాళ్లు కూడా బెంబేలెత్తేలా ఉన్నారు. దీంతో సోమవారం ప్రైవేటులో చికిత్సకు ధరలను ప్రభుత్వం నిర్ణయించింది.

కరోనా పరీక్షకు రూ. 2,200, వెంటిలేటర్ లేకుండా చికిత్స అందిస్తే రోజుకు రూ.7,000, వెంటిలేటర్‌పై అయితే రోజుకు రూ. 9,000 గా నిర్ణయించింది. అలాగే సాధారణ ఐసోలేషన్‌ బెడ్‌కు రోజుకు రూ. 4500 వసూలు చేయాలని నిర్ణయించారు. ఇవాళ వైద్యారోగ్య ఉన్నతాధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ ఫీజులను నిర్ణయించారు. ఈ మేరకు త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నారు.

First Published:  15 Jun 2020 2:40 AM GMT
Next Story