Telugu Global
Cinema & Entertainment

వేడుకలు మిస్సయిన పెదరాయుడు

మెహన్ బాబు కెరీర్ లో మరపురాని చిత్రం పెదరాయుడు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై అప్పటికీ, ఇప్పటికీ అతిపెద్ద విజయం ఈ సినిమాదే. అలాంటి సినిమా ఇవాళ్టితో పాతికేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భాన్ని ఘనంగా సెలబ్రేట్ చేయాలనుకున్నారు మోహన్ బాబు. కానీ లాక్ డౌన్ వల్ల వేడుకల్ని మానుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ ఏడాది, ఈ నెలలో పెదరాయుడు సినిమా పాతికేళ్లు పూర్తిచేసుకోనుందనే విషయం మోహన్ బాబుకు దాదాపు 5 నెలల కిందటే తెలుసు. అప్పట్నుంచే ఆయన ప్రణాళికలు […]

వేడుకలు మిస్సయిన పెదరాయుడు
X

మెహన్ బాబు కెరీర్ లో మరపురాని చిత్రం పెదరాయుడు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై అప్పటికీ, ఇప్పటికీ అతిపెద్ద విజయం ఈ సినిమాదే. అలాంటి సినిమా ఇవాళ్టితో పాతికేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భాన్ని ఘనంగా సెలబ్రేట్ చేయాలనుకున్నారు మోహన్ బాబు. కానీ లాక్ డౌన్ వల్ల వేడుకల్ని మానుకోవాల్సి వచ్చిందన్నారు.

ఈ ఏడాది, ఈ నెలలో పెదరాయుడు సినిమా పాతికేళ్లు పూర్తిచేసుకోనుందనే విషయం మోహన్ బాబుకు దాదాపు 5 నెలల కిందటే తెలుసు. అప్పట్నుంచే ఆయన ప్రణాళికలు రచించుకున్నారట. ఆ సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ కు ఫోన్ చేసి ముందే చెప్పారట. మరీ ముఖ్యంగా రజనీకాంత్ నుంచి కూడా హామీ తీసుకున్నారట. ఇండస్ట్రీలో చిరంజీవి లాంటి పెద్దల్ని పిలిచి గ్రాండ్ గా వేడుకలు నిర్వహించాలనుకున్నారట. అంతలోనే కరోనా రావడం, వేడుకలన్నీ రద్దయిపోవడం చకచకా జరిగిపోయాయంటున్నారు మోహన్ బాబు.

25 సంవత్సరాల కిందట పెదరాయుడు ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాతో పాటు చిరంజీవి నటించిన బిగ్ బాస్ కూడా రిలీజైంది. మొదటి రోజు బిగ్ బాస్ కు నెగెటివ్ టాక్ వచ్చింది. చిరంజీవి నటించిన కొన్ని సినిమాలకు అలాంటి నెగెటివ్ టాక్ రావడం సహజం. ఎందుకంటే అప్పట్లో బాలయ్య తో పోటీ అలా ఉండేది. ఆ తర్వాత మెల్లగా చిరంజీవి సినిమాలు కోలుకున్న సందర్భాలున్నాయి. అయితే పెదరాయుడు దెబ్బకు మాత్రం బిగ్ బాస్ కోలుకోలేకపోయింది. పెదరాయుడు ప్రభంజనం ముందు బిగ్ బాస్ ఫ్లాప్ అవ్వక తప్పలేదు. ఈ విషయాన్ని ఇప్పటికీ చిరు-మోహన్ బాబు అప్పుడప్పుడు చర్చించుకుంటుంటారు.

కేవలం బిగ్ బాస్ మాత్రమే కాదు.. పెదరాయుడు వల్ల ఘరనామొగుడు సృష్టించిన రికార్డుల్ని కూడా చిరంజీవి కోల్పోవాల్సి వచ్చింది. అప్పటివరకు టాలీవుడ్ లో ఆల్ టైమ్ హిట్ ఘరానా మొగుడు మాత్రమే. అలాంటి సినిమాను కూడా క్రాస్ చేసి అఖండ విజయం సాధించాడు పెదరాయుడు. ఈ సినిమాతో మోహన్ బాబు నిర్మాతగా కళ్లుచెదిరే లాభాలు అందుకున్నారు.

First Published:  15 Jun 2020 10:26 AM GMT
Next Story