Telugu Global
Cinema & Entertainment

నా బాయ్ ఫ్రెండ్ నాకంటే 15 ఏళ్లు చిన్న

విశ్వసుందరి సుశ్మితాసేన్, ఓ కుర్రాడితో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ టైమ్ లో రోహ్మన్ సాల్ అనే ఆ కుర్ర మోడల్.. ఏకంగా సుశ్మితాసేన్ ఇంట్లోనే తిష్టవేశాడు. ఇద్దరూ కలిసి వంటలు చేసుకోవడం, యోగా చేయడం, ఆ వీడియోలు పోస్ట్ చేయడం.. ఇలా ఓ రేంజ్ లో హంగామా నడుస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ రోహ్మన్ పై మరోసారి స్పందించింది సుస్మిత సేన్. ఈసారి మరో కొత్త విషయం మోసుకొచ్చింది. “ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా […]

నా బాయ్ ఫ్రెండ్ నాకంటే 15 ఏళ్లు చిన్న
X

విశ్వసుందరి సుశ్మితాసేన్, ఓ కుర్రాడితో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ టైమ్ లో రోహ్మన్ సాల్ అనే ఆ కుర్ర మోడల్.. ఏకంగా సుశ్మితాసేన్ ఇంట్లోనే తిష్టవేశాడు. ఇద్దరూ కలిసి వంటలు చేసుకోవడం, యోగా చేయడం, ఆ వీడియోలు పోస్ట్ చేయడం.. ఇలా ఓ రేంజ్ లో హంగామా నడుస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ రోహ్మన్ పై మరోసారి స్పందించింది సుస్మిత సేన్. ఈసారి మరో కొత్త విషయం మోసుకొచ్చింది.

“ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా రోహ్మాన్‌ నాకు పరిచయమయ్యాడు. కొద్దికాలంలోనే ఇద్దరి టేస్టులు కలిశాయి. అలా ప్రేమలో పడ్డాం. వయసు గురించి అతన్ని ఎప్పుడు అడిగినా సమాధానం దాటవేసేవాడు. ఓ రోజు తన వయసు గురించి నిజం చెప్పినప్పుడు నమ్మలేకపోయాను. నాకంటే 15ఏళ్లు చిన్నవాడని తెలిసి ఆశ్చర్యపోయా. అయితే వయసు మా అనుబంధాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేదని తెలుసుకున్నాం. మా ఇద్దరిది విధి కలిపిన ప్రేమకథ”

ఇలా రోహ్మన్ తనకంటే 15 ఏళ్లు చిన్నవాడనే విషయాన్ని బయటపెట్టింది సుశ్మితసేన్. ప్రస్తుతం బాలీవుడ్ లో డేటింగ్ చేస్తున్న మలైకా అరోరా, అర్జున్ కపూర్ ల మధ్య కూడా దాదాపు 20 ఏళ్ల గ్యాప్ ఉంది. ఆ జంటతో పోలిస్తే ఈ జంట కూడా ఏమాత్రం తక్కువ తినలేదు.

First Published:  14 Jun 2020 4:19 AM GMT
Next Story