Telugu Global
NEWS

అవినీతి మూలవిరాట్ చంద్రబాబు అరెస్ట్‌తోనే అవినీతి కట్టడి సాధ్యం...

గత పాలనలో జరిగిన అవినీతి, కుంభకోణాలకు చంద్రబాబే బాధ్యుడు అని నవ్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కత్తి పద్మారావు వ్యాఖ్యానించారు. చంద్రబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జేసీ ట్రావెల్స్ అక్రమాలలో చంద్రబాబుకూ వాటా ఉందన్నారు. చంద్రబాబు సహకారంతో అనేక అక్రమాలు జరిగాయన్నారు. వాటన్నింటిని నిగ్గుతేల్చేందుకు సీబీఐకి అప్పగించాని డిమాండ్ చేశారు. చంద్రబాబు అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించి మూడు నెలల్లోగా నివేదిక వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో అవినీతి వ్యవస్థను కట్టడి చేయాలంటే అందుకు మూలవిరాట్ […]

అవినీతి మూలవిరాట్ చంద్రబాబు అరెస్ట్‌తోనే అవినీతి కట్టడి సాధ్యం...
X

గత పాలనలో జరిగిన అవినీతి, కుంభకోణాలకు చంద్రబాబే బాధ్యుడు అని నవ్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కత్తి పద్మారావు వ్యాఖ్యానించారు. చంద్రబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జేసీ ట్రావెల్స్ అక్రమాలలో చంద్రబాబుకూ వాటా ఉందన్నారు. చంద్రబాబు సహకారంతో అనేక అక్రమాలు జరిగాయన్నారు. వాటన్నింటిని నిగ్గుతేల్చేందుకు సీబీఐకి అప్పగించాని డిమాండ్ చేశారు.

చంద్రబాబు అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించి మూడు నెలల్లోగా నివేదిక వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రంలో అవినీతి వ్యవస్థను కట్టడి చేయాలంటే అందుకు మూలవిరాట్ అయిన చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేయడంతోనే సాధ్యమవుతుందని కత్తి పద్మారావు వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వంలో గానీ, అంతకుముందు గానీ ఏపీలో నడిచిన దోపిడి ముఠాలకు చంద్రబాబే వెన్నుదన్నుగా నిలిచారని కత్తి పద్మారావు ఆరోపించారు.

First Published:  13 Jun 2020 8:54 PM GMT
Next Story