Telugu Global
Cinema & Entertainment

డైరక్టర్ గా మారబోతున్న హీరోయిన్

దర్శకురాలిగా మారబోతున్న ఓ హీరోయిన్ గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. నటి నిత్యామీనన్ తను కథలు రాస్తున్నట్టు, కుదిరితే దర్శకత్వం వైపు అడుగులు వేస్తానని తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే దారిలో నడుస్తోంది మరో ముద్దుగుమ్మ. ఆమె పేరు రాధికా ఆప్టే. తెలుగులో బాలయ్య సరసన లెజెండ్ లాంటి సినిమాలో నటించిన రాధికా ఆప్టే, ఈ లాక్ డౌన్ టైమ్ లో లండన్ లో ఉంది. లాక్ డౌన్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే తన […]

డైరక్టర్ గా మారబోతున్న హీరోయిన్
X

దర్శకురాలిగా మారబోతున్న ఓ హీరోయిన్ గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. నటి నిత్యామీనన్ తను కథలు రాస్తున్నట్టు, కుదిరితే దర్శకత్వం వైపు అడుగులు వేస్తానని తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే దారిలో నడుస్తోంది మరో ముద్దుగుమ్మ. ఆమె పేరు రాధికా ఆప్టే.

తెలుగులో బాలయ్య సరసన లెజెండ్ లాంటి సినిమాలో నటించిన రాధికా ఆప్టే, ఈ లాక్ డౌన్ టైమ్ లో లండన్ లో ఉంది. లాక్ డౌన్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే తన భర్తతో కలిసి లండన్ చేరుకున్న రాధిక ఆప్టే.. అక్కడే కథలు రాయడం మొదలుపెట్టింది.

తను కథలు రాస్తున్న మాట వాస్తవమేనంటోంది రాధిక. అయితే తను రాస్తున్న కథలు ఎటు వైపు వెళ్తాయో తనకే తెలియడం లేదంటోంది. సినిమాలుగా మలిచేంత స్టఫ్ తన కథలకు ఉందో లేదో తనకు తెలియదని.. నిజంగా సినిమాగా తీసేంత మేటర్ తన స్టోరీల్లో ఉంటే కచ్చితంగా తనే దర్శకురాలిగా మారతానని చెబుతోంది.

First Published:  13 Jun 2020 12:00 AM GMT
Next Story