ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ పదవీకాలం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఎల్వీ సుబ్రహ్మణ్యం తరువాత సీఎస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నీ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. నీలం సాహ్ని పదవీ కాలం ఈ నెల 30తో ముగిసిపోనుంది. అయితే కరోనా కష్ట కాలంలో రాష్ట్రంలో ఆమె సేవలు మరింత అవసరమని… ప్రభుత్వ యంత్రాంగానికి బాస్‌గా ఉన్న ఆమె స్థానంలో కొత్త వాళ్లు వస్తే […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ పదవీకాలం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఎల్వీ సుబ్రహ్మణ్యం తరువాత సీఎస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నీ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.
నీలం సాహ్ని పదవీ కాలం ఈ నెల 30తో ముగిసిపోనుంది. అయితే కరోనా కష్ట కాలంలో రాష్ట్రంలో ఆమె సేవలు మరింత అవసరమని… ప్రభుత్వ యంత్రాంగానికి బాస్‌గా ఉన్న ఆమె స్థానంలో కొత్త వాళ్లు వస్తే ప్రస్తుతం ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఆమె పదవీ కాలాన్ని పెంచాలని కోరుతూ జగన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.
రాష్ట్ర ప్రభుత్వ వినతిని పరిశీలించిన కేంద్రం ఆమోదించింది. దీంతో ఆమె పదవీకాలాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం నీలం సాహ్నీ సెప్టెంబరు 30 వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు.