టీడీపీ నేతల నోట.... ఆ ఒక్క మాట ఎందుకు రావడం లేదు ?
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అయ్యారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో ఆయన పాత్ర ఉందని అధికారులు నిర్ధారించారు. 150 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ప్రాథమిక అంచనా. ఈ స్కామ్‌లో ఆయన ఏ2 నిందితుడు. చట్ట ప్రకారం అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారా? లేదా అనేది పాయింట్. జిల్లాకు చెందిన పది నుంచి పదిహేను మంది టీడీపీ నేతలు మీడియా ముందు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో మాట్లాడారు. చంద్రబాబు సైతం ప్రెస్‌మీట్ పెట్టి […]
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అయ్యారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో ఆయన పాత్ర ఉందని అధికారులు నిర్ధారించారు. 150 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ప్రాథమిక అంచనా. ఈ స్కామ్‌లో ఆయన ఏ2 నిందితుడు. చట్ట ప్రకారం అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారా? లేదా అనేది పాయింట్.
జిల్లాకు చెందిన పది నుంచి పదిహేను మంది టీడీపీ నేతలు మీడియా ముందు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో మాట్లాడారు. చంద్రబాబు సైతం ప్రెస్‌మీట్ పెట్టి సంబంధం లేని విషయాలు చెప్పుకొచ్చారు. కానీ అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడలేదని అనే మాట మాత్రం మాట్లాడలేదు. కనీసం ఆయన అలాంటి వాడు కాదు… ఆయన అన్నయ్య ఎర్రన్నాయుడి వ్యక్తిత్వం,ఆ కుటుంబం గురించి చెప్పలేదు.
టీడీపీ వాదనలో డొల్లతనం ఇక్కడ బయటపడింది. పై నుంచి ఆదేశాలు వస్తున్నాయి …. దాని ప్రకారం మీడియా ముందు అదే పది మంది పలుకుతారు. కాలం మారింది. దాంతో పాటు తమ క్రియేటివిటీ చూపించే ధైర్యం మాత్రం నేతలు చేయలేకపోతున్నారు.
ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి విషయం కూడా అదే. 2017 నాటి కేసు. జేసీ ట్రావెల్స్ గురించి తెలిసిన వారు ఎవరైనా చెబుతారు. బస్సులు నాలుగు ఉంటే…. ఒక బస్సుకు మాత్రమే అన్ని కాగితాలు ఉంటాయి. మిగతా మూడు ప్రభుత్వ లెక్కల్లో ఉండవు. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి…. ప్రయాణికుల ప్రాణాలను తీసిన కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు చేస్తే తప్పేంటి? అనేది జనాల ప్రశ్న.
ఈ రెండు కేసుల్లో నేతలు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ఇందులో తప్పేంటి? తప్పు చేసిన వారిని శిక్షించడం తప్పా? అనేది జనాల లాజిక్. ఈ చిన్న లాజిక్ మిస్ అయిన టీడీపీ కొత్తకొత్త వాదనలతో తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.