Telugu Global
Cinema & Entertainment

వెనక్కి తగ్గిన అమెజాన్ ప్రైమ్

ఇలా లాక్ డౌన్ పడిన వెంటనే అమెజాన్ ప్రైమ్ అలా రెచ్చిపోయింది. ఎన్నో సినిమాల ఎక్స్ క్లూజివ్ రైట్స్ దక్కించుకుంది. థియేటర్లు మూతపడ్డంతో చాలామంది మేకర్స్ కూడా అమెజాన్ ప్రైమ్ కు తమ సినిమాలిచ్చి చేతులు దులుపుకోవాలని చూశారు. దీంతో అమెజాన్ కూడా భారీ మొత్తాలకు సినిమా రైట్స్ దక్కించుకొని స్ట్రీమింగ్ కు పెట్టింది. అయితే ఇప్పుడీ ప్రాసెస్ లో అమెజాన్ సంస్థ కాస్త వెనక్కి తగ్గింది. ఓ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీలో […]

వెనక్కి తగ్గిన అమెజాన్ ప్రైమ్
X

ఇలా లాక్ డౌన్ పడిన వెంటనే అమెజాన్ ప్రైమ్ అలా రెచ్చిపోయింది. ఎన్నో సినిమాల ఎక్స్ క్లూజివ్ రైట్స్ దక్కించుకుంది. థియేటర్లు మూతపడ్డంతో చాలామంది మేకర్స్ కూడా అమెజాన్ ప్రైమ్ కు తమ సినిమాలిచ్చి చేతులు దులుపుకోవాలని చూశారు. దీంతో అమెజాన్ కూడా భారీ మొత్తాలకు సినిమా రైట్స్ దక్కించుకొని స్ట్రీమింగ్ కు పెట్టింది. అయితే ఇప్పుడీ ప్రాసెస్ లో అమెజాన్ సంస్థ కాస్త వెనక్కి తగ్గింది.

ఓ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేస్తే.. ఓటీటీ ప్రేక్షకులతో పాటు, థియేటర్లకు వెళ్లాలనుకునే జనాలు కూడా తమ వైపు వస్తారనేది అమెజాన్ ప్లాన్. అందుకే భారీ బడ్జెట్ పెట్టి జ్యోతిక నటించిన పొన్మాగళ్ వంథాళ్ సినిమా రైట్స్ తీసుకుంది. అంతకంటే ఎక్కువ మొత్తం పెట్టి అమితాబ్ నటించిన గులాబో సితాబో రైట్స్ కూడా దక్కించుకుంది.

అయితే ఈ రెండు సినిమాలూ ఆ సంస్థకు షాకిచ్చాయి. అటు జ్యోతిక సినిమా ఓటీటీలో ఫ్లాప్ అవ్వగా.. తాజాగా స్ట్రీమింగ్ కు వచ్చిన బిగ్ బి సినిమాకు ఆదరణ అంతంతమాత్రంగా ఉంది. దీంతో ఇకపై పెద్ద సినిమాల్ని కొనేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని నిర్ణయించుకుంది అమెజాన్ ప్రైమ్. ప్రస్తుతం తన వద్ద ఉన్న కొన్ని భారీ ప్రాజెక్టుల్ని పెండింగ్ లో పెట్టింది.

చాలామంది మేకర్స్ కు ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఇన్నాళ్లు అమెజాన్ ప్రైమ్ పై ఆశలు పెట్టుకున్న ఎంతోమంది నిర్మాతలకు ఇది బ్యాడ్ న్యూస్. పైగా ఇప్పుడిప్పుడే అమెజాన్ ప్రైమ్ వైపు వస్తున్న తెలుగు నిర్మాతలకు ఇది మరీ పెద్ద దెబ్బ.

First Published:  13 Jun 2020 3:00 AM GMT
Next Story