Telugu Global
NEWS

తెలంగాణలో కరోనా కంట్రోల్‌ తప్పిందా?

తెలంగాణలో కరోనా కేసులు రోజుకు 200 వరకు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీతో పాటు మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే ప్రతిరోజూ 150కి పైగా కేసులు రికార్డు అవుతున్నాయి. దీంతో హైదరాబాద్‌ జనంలో భయం మొదలైంది. కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్‌ అవుతుందా? అనే ఆందోళన పట్టుకుంది. తెలంగాణలో గురువారం 208 కేసులు పాజిటివ్‌గా తేలాయి. వీటిలో జీహెచ్‌ఎంసీలో నమోదైన కేసుల సంఖ్య 175. మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో 17 బయటపడ్డాయి. అయితే ఇతర జిల్లాల్లో కూడా ఒకటి రెండు […]

తెలంగాణలో కరోనా కంట్రోల్‌ తప్పిందా?
X

తెలంగాణలో కరోనా కేసులు రోజుకు 200 వరకు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీతో పాటు మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే ప్రతిరోజూ 150కి పైగా కేసులు రికార్డు అవుతున్నాయి. దీంతో హైదరాబాద్‌ జనంలో భయం మొదలైంది. కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్‌ అవుతుందా? అనే ఆందోళన పట్టుకుంది.

తెలంగాణలో గురువారం 208 కేసులు పాజిటివ్‌గా తేలాయి. వీటిలో జీహెచ్‌ఎంసీలో నమోదైన కేసుల సంఖ్య 175. మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో 17 బయటపడ్డాయి. అయితే ఇతర జిల్లాల్లో కూడా ఒకటి రెండు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

కిడ్నీ పేషెంట్లు, కేన్సర్ రోగులు హైదరాబాద్‌కు వచ్చి ఆసుపత్రిలో చికిత్స తీసుకుని సొంత జిల్లాలకు వెళ్ళిపోతున్నారు. వీరు కరోనా బారిన పడుతున్నారు. వీరి నుంచి కుటుంబసభ్యులకు వ్యాపిస్తోంది. తాజాగా కరీంనగర్, వరంగల్ అర్బన్‌లో నమోదైన కేసులు ఈ కోవకు చెందినవే.

తెలంగాణలో ఒకే ఒక గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందించడంపై విమర్శలు మొదలయ్యాయి. గచ్చిబౌలి ఆఫీస్‌ ఇంకా ఎందుకు ప్రారంభించలేదు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ చికిత్స అందిస్తే బాగుంటుందని… గాంధీ ఆసుపత్రి పై భారం తగ్గుతుందనేది కొందరి మాట.

ఇక ఇటీవల జర్నలిస్టు మృతితో గాంధీ ఆసుపత్రిలో సేవలపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. కరోనా బాధితులకు టైమ్‌కు భోజన సదుపాయాలు కల్పించకపోవడం ఏంటి? అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. మొదట్లో మాటలు చెప్పిన ప్రభుత్వం… ఆతర్వాత పట్టించుకోవడం లేదని..అందుకే కరోనా కేసులు పెరుగుతున్నాయని కొందరు వాపోతున్నారు. ఇప్పటికైనా పట్టించుకోకపోతే మళ్లీ లాక్‌డౌన్‌ విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.

First Published:  11 Jun 2020 8:18 PM GMT
Next Story