Telugu Global
Cinema & Entertainment

నిత్యామీనన్ రూటు మార్చిందా?

నిత్యామీనన్.. ఈ హీరోయిన్ కు ఓ సెపరేట్ ఇమేజ్ ఉంది. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయదు. మంచి పాత్రలు మాత్రమే సెలక్ట్ చేసుకుంటుంది. నిత్యామీనన్ ఓ సినిమా చేసిందంటే, అందులో ఆమె పాత్ర కచ్చితంగా కొత్తగా ఉంటుందనే ఇమేజ్ ఉంది. అలాంటి హీరోయిన్ కాస్తా ఇప్పుడు రూటు మార్చినట్టు కనిపిస్తోంది. అవును.. మరో కొత్త ప్రయోగం చేస్తోంది నిత్యామీనన్. ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా టైమ్ పాస్ చేస్తుంటే.. నిత్యామీనన్ మాత్రం […]

నిత్యామీనన్ రూటు మార్చిందా?
X

నిత్యామీనన్.. ఈ హీరోయిన్ కు ఓ సెపరేట్ ఇమేజ్ ఉంది. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయదు. మంచి పాత్రలు మాత్రమే సెలక్ట్ చేసుకుంటుంది. నిత్యామీనన్ ఓ సినిమా చేసిందంటే, అందులో ఆమె పాత్ర కచ్చితంగా కొత్తగా ఉంటుందనే ఇమేజ్ ఉంది. అలాంటి హీరోయిన్ కాస్తా ఇప్పుడు రూటు మార్చినట్టు కనిపిస్తోంది. అవును.. మరో కొత్త ప్రయోగం చేస్తోంది నిత్యామీనన్.

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా టైమ్ పాస్ చేస్తుంటే.. నిత్యామీనన్ మాత్రం స్టోరీ రైటర్ గా మారింది. స్వయంగా కొన్ని కథలు రాయడం స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని నిత్యామీనన్ స్వయంగా బయటపెట్టింది.

“ఈ లాక్ డౌన్ టైమ్ లో పరిసరాల్ని, వ్యక్తుల్ని, దేశంలో జరిగిన కొన్ని ఘటనల్ని పరిశీలించడం స్టార్ట్ చేశాను. వాటి ఆధారంగా కథలు రాయడం మొదలుపెట్టాను. మరికొన్ని రోజుల్లో కొన్ని కథలు పూర్తవుతాయి.”

ఇలా తను కథలు రాస్తున్న విషయాన్ని బయటపెట్టింది నిత్యామీనన్. చూస్తుంటే.. ఈ హీరోయిన్ నటన నుంచి దర్శకత్వం వైపు మళ్లుతుందేమో చూడాలి. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. నిత్యామీనన్ లా ఈ లాక్ డౌన్ ను సద్వినియోగం చేసుకున్న హీరోయిన్ మరొకరు లేరు.

First Published:  11 Jun 2020 9:06 PM GMT
Next Story