Telugu Global
NEWS

హైదరాబాద్ మేయర్ కార్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా లక్షణాలు లేకుండా వ్యాపిస్తోది. తాజాగా జరిపిన ర్యాండమ్ పరీక్షల్లో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ జరిగింది. గురువారం ఉదయం వరకు కూడా సదరు డ్రైవర్ విధుల్లో ఉండటం గమనార్హం. రామ్మోహన్ కారుకు డ్రైవర్‌గా పని చేస్తున్న అతడికి ఎలాంటి కోవిడ్-19 లక్షణాలు లేవు. అయినా సరే సాధారణంగా జరిపే పరీక్షలు చేయడంతో అతడు కరోనాతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో మేయర్ కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. […]

హైదరాబాద్ మేయర్ కార్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్
X

తెలంగాణలో కరోనా లక్షణాలు లేకుండా వ్యాపిస్తోది. తాజాగా జరిపిన ర్యాండమ్ పరీక్షల్లో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ జరిగింది. గురువారం ఉదయం వరకు కూడా సదరు డ్రైవర్ విధుల్లో ఉండటం గమనార్హం.

రామ్మోహన్ కారుకు డ్రైవర్‌గా పని చేస్తున్న అతడికి ఎలాంటి కోవిడ్-19 లక్షణాలు లేవు. అయినా సరే సాధారణంగా జరిపే పరీక్షలు చేయడంతో అతడు కరోనాతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో మేయర్ కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. మేయర్ రామ్మోహన్‌కు శుక్రవారం మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇటీవల నగరంలో పలు ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన సమయంలో మేయర్ ఒక టీస్టాల్‌లో చాయ్ తాగారు. అయితే సదరు టీ మాస్టర్ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో తర్వాతి రోజు రామ్మోహన్‌కు పరీక్షలు నిర్వహిస్తే.. నెగెటివ్‌గా తేలింది. అదే సమయంలో ఇతర సిబ్బందికి పరీక్షలు చేయగా డ్రైవర్‌కు పాజిటివ్ అని తేలింది.

First Published:  11 Jun 2020 8:07 PM GMT
Next Story