Telugu Global
Cinema & Entertainment

పాటను సమర్థించుకున్న బాలయ్య...

జగదేకవీరుని కథ సినిమాలో శివశంకరి అనే పాటను ఖూనీ చేసి పడేశాడు బాలయ్య. పుట్టినరోజుకు సర్ ప్రైజ్ సాంగ్ రిలీజ్ చేస్తానని చెప్పి, సంగీతాభిమానులకు కోపం తెప్పించాడు. బాలయ్య పాడిన ఆ పాటపై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. చాలామంది నేరుగానే బాలయ్యను నానా మాటలన్నారు. అలా ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ట్రోలింగ్ కు గురయ్యాడు బాలయ్య. అయితే దీనిపై ఎలాంటి బాధను వ్యక్తంచేయలేదు ఈ హీరో. ధైర్యం చేసి ఆ పాట […]

పాటను సమర్థించుకున్న బాలయ్య...
X

జగదేకవీరుని కథ సినిమాలో శివశంకరి అనే పాటను ఖూనీ చేసి పడేశాడు బాలయ్య. పుట్టినరోజుకు సర్ ప్రైజ్ సాంగ్ రిలీజ్ చేస్తానని చెప్పి, సంగీతాభిమానులకు కోపం తెప్పించాడు. బాలయ్య పాడిన ఆ పాటపై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. చాలామంది నేరుగానే బాలయ్యను నానా మాటలన్నారు. అలా ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ట్రోలింగ్ కు గురయ్యాడు బాలయ్య.

అయితే దీనిపై ఎలాంటి బాధను వ్యక్తంచేయలేదు ఈ హీరో. ధైర్యం చేసి ఆ పాట పాడానని, బాగా పాడలేదని తెలిసినా, తన ధైర్యాన్ని అంతా మెచ్చుకోవాలని అంటున్నాడు బాలయ్య. అసలు ఈ పాట పాడడం ఎందుకు, దానికి ధైర్యం అనే పేరు పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. బాలయ్య మాత్రం వెనక్కి తగ్గలేదు.

“మా హీరోలంతా మందు మీద, కాఫీ మీద, టీ మీద రకరకాల పాటలు పాడారు. అసలే నాకు ధైర్యం, సాహసం ఎక్కువ. ఇలాంటి పాటలు ఎందుకు పాడాలనుకున్నానంటే… కాస్త ఛాలెంజింగ్ గా ఉండే పాట తీసుకోవాలనుకున్నాను. శివశంకరి పాట నాకిష్టమైన పాట. ఆ సాంగ్ పాడాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. మొత్తానికి పాడేశాను. ఆ పాటను నేను ఎలా పాడానన్నది ముఖ్యం కాదు, అక్కడ నా తెగింపు, ధైర్యసాహసాల్ని చూడాలి. నందమూరి వంశం అంటేనే ధైర్యసాహసాలకు పేరు.”

ఇలా తన ఖూనీని సమర్థించుకునే ప్రయత్నం చేసుకున్నారు బాలయ్య. ఎవరో ఏదో అంటారని తను వెనక్కి తగ్గే రకం కాదన్న బాలయ్య… భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేస్తానని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

First Published:  11 Jun 2020 8:57 PM GMT
Next Story