Telugu Global
Cinema & Entertainment

మెగా ఫ్యామిలీపై మిల్కీబ్యూటీ కామెంట్స్

హీరోయిన్లలో అతికొద్ది మందికి మాత్రమే దక్కిన అరుదైన అవకాశం తమన్నకు దక్కింది. మెగా కాంపౌండ్ హీరోలతో నటించిన అతికొద్ది మంది హీరోయిన్లలో మిల్కీబ్యూటీ ఒకరు. రామ్ చరణ్, బన్నీ, చిరంజీవి, పవన్ కల్యాణ్.. ఇలా మెగా కాంపౌండ్ హీరోలందరితో ఆమె నటించింది. ఈ లాక్ డౌన్ టైమ్ లో అభిమానులతో చిట్ చాట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. మరోసారి ఆ కాంపౌండ్ పై స్పందించింది. “దాదాపు మెగా ఫ్యామిలీ హీరోలందరితో నేను సినిమాలు చేశాను. వాళ్లు స్టార్ […]

మెగా ఫ్యామిలీపై మిల్కీబ్యూటీ కామెంట్స్
X

హీరోయిన్లలో అతికొద్ది మందికి మాత్రమే దక్కిన అరుదైన అవకాశం తమన్నకు దక్కింది. మెగా కాంపౌండ్ హీరోలతో నటించిన అతికొద్ది మంది హీరోయిన్లలో మిల్కీబ్యూటీ ఒకరు. రామ్ చరణ్, బన్నీ, చిరంజీవి, పవన్ కల్యాణ్.. ఇలా మెగా కాంపౌండ్ హీరోలందరితో ఆమె నటించింది. ఈ లాక్ డౌన్ టైమ్ లో అభిమానులతో చిట్ చాట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. మరోసారి ఆ కాంపౌండ్ పై స్పందించింది.

“దాదాపు మెగా ఫ్యామిలీ హీరోలందరితో నేను సినిమాలు చేశాను. వాళ్లు స్టార్ డమ్ ను తేలిగ్గా తీసుకోరు. బ్యాక్ గ్రౌండ్ ఉందని నిర్లక్ష్యంగా ఉండరు. ప్రతి సినిమాకు చాలా కష్టపడతారు. దాదాపు మెగా హీరోలందర్లో నేను ఈ విషయం గమనించాను. ఆ ఫ్యామిలీ నన్ను ఎప్పుడూ సొంత మనిషిగా చూసుకుంటుంది. నా జీవితంలో మెగా కుటుంబం ఓ భాగం.”

ఇలా మెగా కాంపౌండ్ పై ఉన్న అభిమానాన్ని బయటపెట్టింది తమన్న. మరీ ముఖ్యంగా చిరంజీవి లాంటి లెజెండ్ తో కలిసి వర్క్ చేసే అవకాశం రావడాన్ని తన అదృష్టంగా చెప్పుకొచ్చింది. చిరంజీవి ఎప్పుడూ తనను సపోర్ట్ చేస్తుంటారని.. ఇంట్లో మనిషిగా చూస్తుంటారని అంటోంది తమన్న.

First Published:  10 Jun 2020 10:30 PM GMT
Next Story