Telugu Global
National

'గడువులోగా పోలవరం పూర్తి చేస్తాం' " మేఘా జీఎం సతీష్‌

 వలస కార్మికులను తిరిగి రప్పించిన ‘మేఘా’ ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం పనుల్లో వేగం పెరిగింది. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా ప్రాజెక్టు పనులు చేస్తున్న వలస కార్మికులు భారీగా తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఇక్కడ పని చేస్తున్న అధిక మంది కూలీలు, కార్మికులు బీహార్, ఝార్ఖండ్, ఒడిషా ప్రాంతాలకు చెందిన వాళ్లే. ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్) సంస్థను పనుల్లో వేగం పెంచాలని ఏపీ నీటిపారుదల శాఖ ఆదేశించింది. […]

గడువులోగా పోలవరం పూర్తి చేస్తాం  మేఘా జీఎం సతీష్‌
X
  • వలస కార్మికులను తిరిగి రప్పించిన ‘మేఘా’

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం పనుల్లో వేగం పెరిగింది. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా ప్రాజెక్టు పనులు చేస్తున్న వలస కార్మికులు భారీగా తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఇక్కడ పని చేస్తున్న అధిక మంది కూలీలు, కార్మికులు బీహార్, ఝార్ఖండ్, ఒడిషా ప్రాంతాలకు చెందిన వాళ్లే. ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్) సంస్థను పనుల్లో వేగం పెంచాలని ఏపీ నీటిపారుదల శాఖ ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన మేఘా సంస్థ వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి తిరిగి పోలవరం రప్పించింది.

పోలవరం ప్రాంతం నుంచి వెళ్లిన వారితో పాటు మరి కొంత మంది కొత్త కూలీలు కలిపి 2వేల మంది తిరిగి పనులు చేయడానికి వచ్చారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడానికి మరింత మంది కూలీలు అవసరమే. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా రావడానికి జంకుతున్నారు. అయితే ఉన్న వారితోనే మేఘా సంస్థ పనులు చేయిస్తోంది.

కోవిడ్-19 కారణంగా కూలీల కొరత మాత్రమే కాకుండా.. స్టీల్, సిమెంట్, ఇతర సామాగ్రి సరఫరాలో కూడా జాప్యం జరుగుతోంది. ఏప్రిల్, మే నెలల్లో రవాణా వ్యవస్థ స్తంభించడంతో ప్రాజెక్టు వద్ద సామాగ్రి కొరత ఏర్పడింది. ఇప్పుడు రవాణా అందుబాటులో ఉండటంతో సామాగ్రిని త్వరతగతిన తెప్పిస్తున్నారు.

ప్రాజెక్టు ప్రాంతంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని పనులను ప్రారంభించారు. మార్చి నుంచి మే వరకు పనుల్లో వేగం పెంచాలని భావించారు. కానీ అనుకోకుండా వచ్చిన కరోనా వల్ల అంతరాయం కలిగింది. మేఘా సంస్థ జనరల్ మేనేజర్ సతీష్ అంగార మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ది స్పిల్ వే పనులు పూర్తయ్యాయి. స్పిన్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులతో పాటు 1,2,3 గ్యాప్ పనులు ప్రస్తుతం వేగవంతంగా సాగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి మాకు ఇచ్చిన డెడ్‌లైన్ లోపు పనులు పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న స్పిల్ వే 50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసేలా నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు చైనాలోని త్రీ గార్జెస్. దీని స్పిల్ వే కెపాసిటీ 47 లక్షల క్యూసెక్కులు మాత్రమే. ప్రస్తుతం 1,21,647 క్యూబిక్ మీటర్ల స్పిల్ వే పనులు, 79,378 క్యూబిట్ మీటర్ల స్పిల్ ఛానల్ పనులు పూర్తయినట్లు సతీష్ అంగార తెలిపారు.

First Published:  11 Jun 2020 6:21 AM GMT
Next Story