Telugu Global
Cinema & Entertainment

లాక్ డౌన్ లో 15 కిలోలు తగ్గింది

హీరోయిన్లంతా ఈ లాక్ డౌన్ టైమ్ ను ఒక్కొక్క విధంగా ఉపయోగించుకుంటున్నారు. అందర్నీ ఓసారి కంపేర్ చేసి చూస్తే.. అందరికంటే హీరోయిన్ కృతి సనన్ ఈ లాక్ డౌన్ టైమ్ ను బాగా ఉపయోగించుకున్నట్టు అర్థమౌతుంది. అవును.. రెండున్నర నెలల లాక్ డౌన్ టైమ్ లో ఆమె ఏకంగా 15 కిలోల బరువు తగ్గింది. హిందీలో మిమీ అనే సినిమాలో నటిస్తోంది కృతి సనన్. అందులో ఆమె ఓ ఎపిసోడ్ లో గర్భవతిగా కనిపించాలి. దాని కోసం […]

లాక్ డౌన్ లో 15 కిలోలు తగ్గింది
X

హీరోయిన్లంతా ఈ లాక్ డౌన్ టైమ్ ను ఒక్కొక్క విధంగా ఉపయోగించుకుంటున్నారు. అందర్నీ ఓసారి కంపేర్ చేసి చూస్తే.. అందరికంటే హీరోయిన్ కృతి సనన్ ఈ లాక్ డౌన్ టైమ్ ను బాగా ఉపయోగించుకున్నట్టు అర్థమౌతుంది. అవును.. రెండున్నర నెలల లాక్ డౌన్ టైమ్ లో ఆమె ఏకంగా 15 కిలోల బరువు తగ్గింది.

హిందీలో మిమీ అనే సినిమాలో నటిస్తోంది కృతి సనన్. అందులో ఆమె ఓ ఎపిసోడ్ లో గర్భవతిగా కనిపించాలి. దాని కోసం ఏకంగా 15 కిలోలు పెరిగింది. ఆ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. ఆ వెంటనే దేశం లాక్ డౌన్ లోకి వెళ్లింది. సరిగ్గా ఈ టైమ్ ను తన బరువు తగ్గించుకోవడానికి వాడుకుంది కృతి సనన్. డైటీషియన్ చెప్పిన సూచనల్ని పాటిస్తూ, రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. పెరిగిన 15 కిలోల బరువులో దాదాపు 14 కిలోలు తగ్గి చూపించింది. ఇంకొన్ని రోజుల్లో ఆ ఒక్క కిలో కూడా తగ్గి, మునుపటి షేప్ లోకి వచ్చేస్తానంటోంది కృతి.

ఈ విషయాలన్నింటినీ తాజాగా తన ఇనస్టాగ్రామ్ లైవ్ లో చెప్పుకొచ్చింది. తన డైటీషియన్ ను కూడా పరిచయం చేసింది. మహేష్ బాబు హీరోగా చేసిన వన్-నేనొక్కడినే సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

First Published:  9 Jun 2020 11:00 PM GMT
Next Story