Telugu Global
International

లక్షణాలు లేని వారితో అంత ప్రమాదం లేదు : డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కబలిస్తోన్న కరోనా వైరస్ ఇప్పుడు సరి కొత్త రూపంలో వస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కరోనా బారిన పడిన వాళ్లలో కనిపించేవి. కానీ ఇప్పుడు ఎలాంటి రోగ లక్షణాలు లేకుండానే కరోనా బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి వారి ద్వారా మరింత ప్రమాదం అని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి రోగ లక్షణాలు లేని (అసింప్లమాటిక్) వారి వల్ల తీవ్ర ప్రమాదమని, అలాంటి రోగుల […]

లక్షణాలు లేని వారితో అంత ప్రమాదం లేదు : డబ్ల్యూహెచ్‌వో
X

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కబలిస్తోన్న కరోనా వైరస్ ఇప్పుడు సరి కొత్త రూపంలో వస్తున్న సంగతి తెలిసిందే.

మొదట్లో దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కరోనా బారిన పడిన వాళ్లలో కనిపించేవి. కానీ ఇప్పుడు ఎలాంటి రోగ లక్షణాలు లేకుండానే కరోనా బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి వారి ద్వారా మరింత ప్రమాదం అని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎలాంటి రోగ లక్షణాలు లేని (అసింప్లమాటిక్) వారి వల్ల తీవ్ర ప్రమాదమని, అలాంటి రోగుల వల్లే కరోనా వైరస్‌ నియంత్రణ జరగడం లేదని నిపుణులు చెప్పారు.

అయితే వీరి వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టి పారేసింది. డబ్ల్యూహెచ్‌వో కోవిడ్-19 టెక్నికల్ డైరెక్టర్ మారియా వాన్ కెర్ఖోవ్ ఈ విషయంపై స్పష్టత నిచ్చారు. లక్షణాలు లేని రోగుల నుంచి ఇతరులకు వైరస్ స్వల్ప స్థాయిలోనే సోకుతుందని చెప్పారు.

లక్షణాలు లేని వారి దగ్గర నుంచి ఇతరులకు సోకడానికి 6 శాతం అవకాశం ఉందని అన్నారు. అయితే ఇది కరోనా ప్రమాదకరస్థాయిలో విజృంభించేందుకు దోహదపడదని చెప్పారు. మరోవైపు అసింప్లమాటిక్ పేషెంట్‌ల నుంచి సంక్రమించిన వ్యాధి తీవ్రత కూడా తక్కువగానే ఉన్నట్లు ఆయన వివరించారు.

First Published:  8 Jun 2020 8:58 PM GMT
Next Story