Telugu Global
Cinema & Entertainment

రానా ఫస్ట్ లుక్ ఇప్పట్లో లేనట్టే!

విరాటపర్వం సినిమాకు సంబంధించి రానా ఫస్ట్ లుక్ కోసం దగ్గుబాటి అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే అది ఇప్పట్లో రాదనే విషయాన్ని దర్శకుడు వేణు ఉడుగుల పరోక్షంగా వెల్లడించాడు. దీనికి సంబంధించి ఓ లాజిక్ కూడా ఆయన చెబుతున్నాడు. విరాటపర్వం సినిమాలో రానాతో పాటు 5 బలమైన స్త్రీ పాత్రలున్నాయట. సాయిపల్లవి, ప్రియమణి, నందితాదాస్, జరీనా వాహెబ్, ఈశ్వరీరావు ఆ 5 పాత్రలు పోషించారు. సినిమాకు సంబంధించి వీళ్ల లుక్స్ తో ప్రచారం ప్రారంభించాలనేది దర్శకుడి ఎత్తుగడ. […]

రానా ఫస్ట్ లుక్ ఇప్పట్లో లేనట్టే!
X

విరాటపర్వం సినిమాకు సంబంధించి రానా ఫస్ట్ లుక్ కోసం దగ్గుబాటి అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే అది ఇప్పట్లో రాదనే విషయాన్ని దర్శకుడు వేణు ఉడుగుల పరోక్షంగా వెల్లడించాడు. దీనికి సంబంధించి ఓ లాజిక్ కూడా ఆయన చెబుతున్నాడు.

విరాటపర్వం సినిమాలో రానాతో పాటు 5 బలమైన స్త్రీ పాత్రలున్నాయట. సాయిపల్లవి, ప్రియమణి, నందితాదాస్, జరీనా వాహెబ్, ఈశ్వరీరావు ఆ 5 పాత్రలు పోషించారు. సినిమాకు సంబంధించి వీళ్ల లుక్స్ తో ప్రచారం ప్రారంభించాలనేది దర్శకుడి ఎత్తుగడ.

ఇందులో భాగంగా సాయిపల్లవి, ప్రియమణి ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత మిగతా మూడు మహిళా పాత్రలకు సంబంధించిన లుక్స్ రిలీజ్ అవ్వాలి. ఆ తర్వాతే రానా లుక్ బయటకొస్తుంది. కాబట్టి విరాటపర్వం నుంచి రానా ఫస్ట్ లుక్ రావాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇలా ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నకు దర్శకుడిచ్చే సమాధానం ఒకటే. సినిమా విడుదలైన తర్వాత ఆ మేటర్ అర్థమౌతుందంట.

First Published:  8 Jun 2020 8:30 PM GMT
Next Story