Telugu Global
International

కరోనా వ్యాప్తిపై సీడీసీ తాజా మార్గదర్శకాలు

మనుషుల నుంచి మనుషులకే ఎక్కువగా సోకుతుంది జంతువుల ద్వారా అవకాశం తక్కువ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో పలు దేశాలు లాక్‌డౌన్ నిబంధనలు సడలించాయి. పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు చేయడం వల్ల సామాన్యులకు కష్టంగా మారడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతోంది. దీంతో పలు నిబంధనల మద్య లాక్‌డౌన్ ఎత్తేశారు. తాజాగా అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కొన్ని మార్గదర్శకాలు, సూచనలు చేసింది. కోవిడ్-19 వ్యాధికి […]

కరోనా వ్యాప్తిపై సీడీసీ తాజా మార్గదర్శకాలు
X
  • మనుషుల నుంచి మనుషులకే ఎక్కువగా సోకుతుంది
  • జంతువుల ద్వారా అవకాశం తక్కువ

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో పలు దేశాలు లాక్‌డౌన్ నిబంధనలు సడలించాయి. పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు చేయడం వల్ల సామాన్యులకు కష్టంగా మారడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతోంది. దీంతో పలు నిబంధనల మద్య లాక్‌డౌన్ ఎత్తేశారు. తాజాగా అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కొన్ని మార్గదర్శకాలు, సూచనలు చేసింది.

కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే కరోనా వైరస్ కేవలం మనుషుల నుంచి మనుషులకు మాత్రమే సంక్రమిస్తుందని చెప్పింది. కోవిడ్-19 వ్యాధిగ్రస్తులు తాకిన వస్తువులు, ఉపరితలాల వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండదని చెబుతోంది. జంతువుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని సీడీసీ స్పష్టం చేసింది.

కరోనా రోగి తుమ్మినా, దగ్గినా అతడి నోటి ద్వారా పడే తుంపర్ల ద్వారా తప్పకుండా ఇతరులకు వ్యాధి సోకుతుంది. అయితే ఆరడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉంటే ఈ వ్యాధి సోకే అవకాశం చాలా తక్కువ.

ఒక కరోనా రోగి నుంచి మరో వ్యక్తికి కరోనా సోకాలంటే 1000 వైరల్ పార్టికల్స్ అవసరం అవుతాయి. శ్వాస ద్వారా అయితే 20 వైరల్ పార్టికల్స్, మాట్లాడితే 200 వైరల్ పార్టికల్స్, దగ్గితే 200 మిలియన్ వైరల్ పార్టికల్స్, తుమ్మినప్పుడు 200 మిలియన్ వైరల్ పార్టికల్స్ వెలువడతాయి. గాలి వెలువడని చోట, వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశంలో ఈ వైరల్ పార్టికల్స్ చాలా సేపు బతికి ఉంటాయి.

కరోనా ఉన్న రోగికి ఆరడుగుల దూరంలో 45 నిమిషాల కంటే తక్కువ సమయం ఉంటే ఈ వైరస్ వ్యాప్తించే అవకాశం తక్కువేనని.. అయితే మాస్క్ ధరించినా.. అత్యంత సమీపంలో ఉండి సదరు వ్యక్తితో 4 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉంటే కరోనా వస్తుందని చెప్పింది. కరోనా రోగి మన పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్లినా.. సైక్లింగ్ చేసినా మనకు వ్యాధి సంక్రమించదు.

బహిరంగ ప్రదేశాల కంటే ఇండోర్‌లో ఉండటం మంచిదని.. చీకటి ప్రదేశాల్లో కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని… కాబట్టి వెలుతురులో ఉండటానికి ప్రయత్నించాలని సీడీసీ చెబుతోంది. కరోనా ప్రస్తుతం తీవ్రతరం కానుండటంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లకపోవడమే మంచిదని సీడీసీ చెప్పింది. సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ చేయడం వల్ల కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చు.

పబ్లిక్‌ బాత్‌రూంలు, సామూహిక ప్రదేశాలు, రెస్టారెంట్ల లోపల కూర్చోవడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. తద్వారా కరోనా తొందరగా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పార్టీలు, పెళ్లిళ్లు, వ్యాపార కేంద్రాలు, సమావేశాలు, సినిమా హాళ్లు, కన్సర్ట్‌లు, ప్రార్థనా స్థలాల ద్వారా అధిక స్థాయిలో కేసులు నమోదయ్యే అవకాశం ఎక్కవగా ఉంది. కాబట్టి ఆయా ప్రదేశాలకు వెళ్లకపోవడమే శ్రేయస్కరం.

First Published:  9 Jun 2020 12:58 AM GMT
Next Story