Telugu Global
Cinema & Entertainment

కొత్త ఫ్రేమ్స్ పరిచయం చేసిన వర్మ

రామ్ గోపాల్ వర్మను లాక్ డౌన్ కూడా ఆపలేకపోయింది. లాక్ డౌన్ అమల్లో ఉన్న సమయంలోనే, షూటింగ్స్ పై ఆంక్షలు ఉన్న టైమ్ లోనే క్లైమాక్స్ అనే సినిమాను పూర్తిచేశాడు వర్మ. అంతేకాదు.. లాక్ డౌన్ ఉన్న టైమ్ లోనే ఆ సినిమాను తన సోషల్ మీడియా వేదికపై రిలీజ్ చేశాడు. బాగానే డబ్బులు చేసుకున్నాడు కూడా. ఇది జరిగిన 2 రోజుల్లోనే మరో సినిమా రెడీ చేశాడు ఈ దర్శకుడు. ఈసారి నగ్నం అనే సినిమాను […]

కొత్త ఫ్రేమ్స్ పరిచయం చేసిన వర్మ
X

రామ్ గోపాల్ వర్మను లాక్ డౌన్ కూడా ఆపలేకపోయింది. లాక్ డౌన్ అమల్లో ఉన్న సమయంలోనే, షూటింగ్స్ పై ఆంక్షలు ఉన్న టైమ్ లోనే క్లైమాక్స్ అనే సినిమాను పూర్తిచేశాడు వర్మ. అంతేకాదు.. లాక్ డౌన్ ఉన్న టైమ్ లోనే ఆ సినిమాను తన సోషల్ మీడియా వేదికపై రిలీజ్ చేశాడు. బాగానే డబ్బులు చేసుకున్నాడు కూడా. ఇది జరిగిన 2 రోజుల్లోనే మరో సినిమా రెడీ చేశాడు ఈ దర్శకుడు.

ఈసారి నగ్నం అనే సినిమాను పరిచయం చేస్తున్నాడు ఆర్జీవీ. ఈ సినిమా షూటింగ్ ను కూడా లాక్ డౌన్ టైమ్ లోనే పూర్తిచేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేశాడు. ఈరోజు టీజర్ ను రిలీజ్ చేశాడు. కొత్త కొత్త ఫ్రేమింగ్స్ కు పెట్టింది పేరైన ఈ దర్శకుడు.. నగ్నం టీజర్ తో మరిన్ని కొత్త ఫ్రేమ్స్ ను జనాలకు పరిచయం చేశాడు. టీజర్ ఎలా ఉందనే విషయాన్ని పక్కనపెడితే.. ఈ ఫ్రేమింగ్స్ చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

జనాలు నవ్వుకున్నా, తిట్టుకున్నా వాళ్లను తనవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న వర్మ.. త్వరలోనే నగ్నం సినిమాను తన సోషల్ మీడియా వాల్ పై రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. దీనికి రేటు కూడా ఫిక్స్ చేశాడు. క్లైమాక్స్ సినిమాను వంద రూపాయలకే చూపించిన ఈ దర్శకుడు.. నగ్నం సినిమాకు 200 రూపాయల రేటును ఫిక్స్ చేశాడు.

First Published:  8 Jun 2020 9:50 AM GMT
Next Story