Telugu Global
NEWS

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం... పదో తరగతి పరీక్షలు రద్దు

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేసేశారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. ఇంటర్నల్, అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేయాలని ఆయన తెలిపారు. కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,34,903 మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. ఇక టీచర్లు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వనున్నారు. కరోనా తీవ్రత పెరిగిపోతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్, […]

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం... పదో తరగతి పరీక్షలు రద్దు
X

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేసేశారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.

ఇంటర్నల్, అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేయాలని ఆయన తెలిపారు. కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5,34,903 మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. ఇక టీచర్లు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వనున్నారు.

కరోనా తీవ్రత పెరిగిపోతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్, రంగారెడ్డి మినహా పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది.

అయితే పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు అనారోగ్యం పాలైనా, మరణాలు సంభవించినా తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని ప్రభుత్వం భావించింది. కరోనాతో ఆటలాడటం కంటే విద్యార్థులను ప్రమోట్ చేయడం ఉత్తమమని భావించడంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

First Published:  8 Jun 2020 7:35 AM GMT
Next Story