Telugu Global
Cinema & Entertainment

రివర్స్ లో చెక్ చేసిన రవిబాబు

లాక్ డౌన్ సడలింపులతో హైదరాబాద్ లో పెద్ద పెద్ద షాపులు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. జాగ్రత్తగా చర్యలు కూడా బాగానే తీసుకుంటున్నారు. షాప్ కు వచ్చిన ప్రతి ఒక్కర్ని చెక్ చేస్తున్నారు. వినియోగదారుడ్ని చెక్ చేస్తున్నారు సరే.. మరి షాపులో పనిచేస్తున్న వారి సంగతేంటి? వాళ్లు కూడా ఆరోగ్యంగా ఉన్నారా లేదా? సరిగ్గా ఇదే ఆలోచన దర్శకుడు-నటుడు రవిబాబుకు వచ్చింది. అనుకున్నదే తడవుగా దాన్ని అమల్లో పెట్టాడు ఈ డైరక్టర్. ఓ పెద్ద షాపుకు వెళ్లాడు రవిబాబు. అక్కడ […]

రివర్స్ లో చెక్ చేసిన రవిబాబు
X

లాక్ డౌన్ సడలింపులతో హైదరాబాద్ లో పెద్ద పెద్ద షాపులు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. జాగ్రత్తగా చర్యలు కూడా బాగానే తీసుకుంటున్నారు. షాప్ కు వచ్చిన ప్రతి ఒక్కర్ని చెక్ చేస్తున్నారు. వినియోగదారుడ్ని చెక్ చేస్తున్నారు సరే.. మరి షాపులో పనిచేస్తున్న వారి సంగతేంటి? వాళ్లు కూడా ఆరోగ్యంగా ఉన్నారా లేదా? సరిగ్గా ఇదే ఆలోచన దర్శకుడు-నటుడు రవిబాబుకు వచ్చింది. అనుకున్నదే తడవుగా దాన్ని అమల్లో పెట్టాడు ఈ డైరక్టర్.

ఓ పెద్ద షాపుకు వెళ్లాడు రవిబాబు. అక్కడ ఎంట్రెన్స్ లోనే సెక్యూరిటీ గార్డ్ రవిబాబును ఆపాడు. ధర్మామీటర్ తలపై పెట్టి టెంపరేచర్ చెక్ చేశాడు. ఇక్కడివరకు అంతా కామన్ గా జరిగే ప్రాసెస్. ఆ తర్వాతే రవిబాబు తన మార్క్ చూపించాడు. తన జేబులోంచి మరో ధర్మామీటర్ తీశాడు. సెక్యూరిటీ గార్డ్ తలమీద పెట్టి అతడి టెంపరేచర్ చూశాడు. ఆ తర్వాతే షాపులోకి ఎంటరయ్యాడు.

చూడ్డానికి చాలా ఫన్నీగా అనిపించే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓవైపు కాస్త కామెడీని పండిస్తూనే మరోవైపు ఎంతో ఉపయోగకరమైన సందేశాన్ని అందించాడు రవిబాబు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని మెసేజ్ ను అంతర్లీనంగా ఈ వీడియోతో ఇచ్చాడు. రవిబాబు చేసిన ఈ ప్రయత్నాన్ని అంతా మెచ్చుకుంటున్నారు.

View this post on Instagram

Had myself some fun today!???

A post shared by Ravi Babu (@ravibabuofficial) on

First Published:  7 Jun 2020 8:57 AM GMT
Next Story