Telugu Global
NEWS

రైతు భరోసా కేంద్రాలపై టీడీపీ కన్ను..

చిన్నచిన్న అంశాలతో వైసీపీ ప్రభుత్వాన్ని చికాకు పెట్టే విషయంలో టీడీపీ విజయవంతంగా పావులు కదుపుతోంది. గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు వేశారంటూ కోర్టులకు వెళ్లిన టీడీపీ ఆ రంగులను మార్చేలా చేయడంలో విజయం సాధించింది. సుప్రీం కోర్టు కూడా రంగులు మార్చాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి రంగులు మార్చడం మినహా మరో దారి లేదు. గ్రామ సచివాలయం రంగులను మార్చేలా చేసిన ఆనందంలో ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలపై టీడీపీ దృష్టి పెట్టింది. కొన్ని […]

రైతు భరోసా కేంద్రాలపై టీడీపీ కన్ను..
X

చిన్నచిన్న అంశాలతో వైసీపీ ప్రభుత్వాన్ని చికాకు పెట్టే విషయంలో టీడీపీ విజయవంతంగా పావులు కదుపుతోంది. గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు వేశారంటూ కోర్టులకు వెళ్లిన టీడీపీ ఆ రంగులను మార్చేలా చేయడంలో విజయం సాధించింది.

సుప్రీం కోర్టు కూడా రంగులు మార్చాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి రంగులు మార్చడం మినహా మరో దారి లేదు.

గ్రామ సచివాలయం రంగులను మార్చేలా చేసిన ఆనందంలో ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలపై టీడీపీ దృష్టి పెట్టింది. కొన్ని చోట్ల రైతు భరోసా కేంద్రాలకు కూడా వైసీపీ రంగులు వేశారని… వాటర్‌ ట్యాంకులకు అవే రంగులు అద్దారని … మరి వీటి సంగతేంటి అని ఇప్పుడు టీడీపీ మీడియా ప్రచారం మొదలుపెట్టింది.

పత్రికల్లో కూడా అదే తరహా కథనాలు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తుంటే తదుపరి రైతు భరోసా కేంద్రాల రంగులను కూడా మార్చాల్సిందేనంటూ కోర్టుల్లో టీడీపీ సానుభూతిపరులు పిటిషన్లు వేసే అవకాశం కనిపిస్తోంది. అప్పుడు కోర్టుల తీర్పులు కూడా గ్రామ సచివాలయం తరహాలోనే ఉండవచ్చు.

వైసీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నా ఇలాంటి చిన్న అంశాలతోనే ఎక్కువగా నెగిటివ్‌ ప్రచారం జరుగుతోంది. కాబట్టి వైసీపీ ప్రభుత్వం కూడా ఈ రంగుల పిచ్చిని వదులుకోవడమే మంచిదేమో!.

First Published:  4 Jun 2020 1:14 AM GMT
Next Story