Telugu Global
NEWS

సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్‌ మాధురి అరెస్ట్‌

అమరావతి భూ స్కామ్‌లపై ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక విషయాలను బయటకుతీస్తోంది. భూ అక్రమాలపై ఏర్పాటు చేసిన సిట్…‌ డిప్యూటీ కలెక్టర్‌ మాధురిని అరెస్ట్ చేసింది. విజయవాడలోని ఆమె నివాసంలో సిట్‌ బృందం అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచింది. ఆమెకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. రాజధాని ప్రాంతంలోని నెక్కల్లు గ్రామంలో 2016లో ప్రభుత్వ భూమిని ఇదే గ్రామానికి చెందిన రావెల గోపాలకృష్ణ అనే వ్యక్తి డూప్లికేట్‌ దస్తావేజులు క్రియేట్‌ చేస్తే… అక్రమంగా డిప్యూటీ కలెక్టర్‌ […]

సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్‌ మాధురి అరెస్ట్‌
X

అమరావతి భూ స్కామ్‌లపై ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక విషయాలను బయటకుతీస్తోంది. భూ అక్రమాలపై ఏర్పాటు చేసిన సిట్…‌ డిప్యూటీ కలెక్టర్‌ మాధురిని అరెస్ట్ చేసింది. విజయవాడలోని ఆమె నివాసంలో సిట్‌ బృందం అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచింది. ఆమెకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది.

రాజధాని ప్రాంతంలోని నెక్కల్లు గ్రామంలో 2016లో ప్రభుత్వ భూమిని ఇదే గ్రామానికి చెందిన రావెల గోపాలకృష్ణ అనే వ్యక్తి డూప్లికేట్‌ దస్తావేజులు క్రియేట్‌ చేస్తే… అక్రమంగా డిప్యూటీ కలెక్టర్‌ మాధురి రిజిస్టర్‌ చేశారు. 3 ఎకరాల 20 గుంటల భూమికి మాధురి నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్‌ చేశారు.

వైసీపీ ప్రభుత్వం అధికారింలోకి వచ్చిన తర్వాత…. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఇందులో భాగంగా సీఆర్డీఏ అక్రమాలపై విచారణ జరిపితే….అక్రమంగా ఈ భూమి బదలాయింపు జరిగినట్లు నిర్ధారణ జరిగింది. నెల రోజుల కిందట నెక్కళ్లు గ్రామానికి చెందిన రావెల గోపాలకృష్ణను సిట్‌ అరెస్టు చేసింది. ఆ తర్వాత రిమాండ్‌కు పంపించింది.

ఈ ఒక్క గ్రామంలోనే కాదు…. మందడం గ్రామంలో కూడా ఓ పది సెంట్ల భూమిని ఇలాగే అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒకరి భూమిని మరొకరికి…. దొంగ కాగితాలు సృష్టించి దొంగ రిజిస్ట్రేషన్‌ చేసినట్లు మాధురిపై అప్పుట్లో వార్తలు వచ్చాయి. పేదల భూములతో ఆడుకున్న అధికారులను వదిలిపెట్టొద్దని అమరావతి వాసులు కోరుతున్నారు.

First Published:  3 Jun 2020 7:44 PM GMT
Next Story