20-20 ఫార్మాట్‌లా కరోనా.... త్వరలోనే 5 లక్షల కేసులు ?
లాక్‌డౌన్ జూన్ 30 వరకు పొడిగించారు. ఇటు అన్‌లాక్1 ప్రారంభమైంది. తొలిరోజు నగరాల రోడ్ల పై భారీగా వాహనాలు వచ్చాయి. జనాలు ఒక్కసారిగా బయటకువచ్చారు. ఇటు కేసులు కూడా అదే స్థాయిలో సోమవారం రికార్డు అయ్యాయి. దేశవ్యాప్తంగా కేసులు రెండు లక్షలకు చేరువ అయ్యాయి. సోమవారం ఒక్కరోజే 8,392 కేసులు నమోదు అయ్యాయి. ఈ పరిస్థితి చూస్తే జూన్‌లోనే ఐదు లక్షల కేసులు దాటిపోయే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్యలో భారత్ ఏడో స్థానానికి […]

లాక్‌డౌన్ జూన్ 30 వరకు పొడిగించారు. ఇటు అన్‌లాక్1 ప్రారంభమైంది. తొలిరోజు నగరాల రోడ్ల పై భారీగా వాహనాలు వచ్చాయి. జనాలు ఒక్కసారిగా బయటకువచ్చారు. ఇటు కేసులు కూడా అదే స్థాయిలో సోమవారం రికార్డు అయ్యాయి.
దేశవ్యాప్తంగా కేసులు రెండు లక్షలకు చేరువ అయ్యాయి. సోమవారం ఒక్కరోజే 8,392 కేసులు నమోదు అయ్యాయి. ఈ పరిస్థితి చూస్తే జూన్‌లోనే ఐదు లక్షల కేసులు దాటిపోయే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్యలో భారత్ ఏడో స్థానానికి చేరింది. మరో పది రోజుల్లో టాప్ ఫైవ్‌లో చేరుతుందని ఆందోళన చెందుతున్నారు.
మనదేశంలో లాక్‌డౌన్ మొదలైన సమయంలో ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. కానీ మనదేశంలో వందల సంఖ్యలో కూడా కేసులు నమోదు కాలేదు. కానీ ఇప్పుడు తాజాగా 6 వేలకు తగ్గడం లేదు. ఈ సంఖ్య చూస్తే ఆందోళన కలిగిస్తుందని డాక్టర్లు అంటున్నారు.
లాక్‌డౌన్ సమయంలో టెస్ట్ మ్యాచ్ తరహాలో కేసులు నమోదు అయ్యేవి. మార్చి నుంచి ఏప్రిల్ 30 వరకు కేసుల తీవ్రత పెద్దగా లేదు. మృతుల సంఖ్య కూడా పెద్దగా నమోదు కాలేదు. కానీ మే నెలలో మాత్రం ఒక్కసారిగా కేసులు పెరిగాయి. వన్డే ఫార్మాట్‌లోకి మారి ప్రతిరోజూ మూడు వేలకు పైగానే కేసులు రిజిస్టర్ అయ్యాయి. జూన్ నుంచి ఇక 20-20 మ్యాచ్ తరహాలోనే కరోనా కేసులు నమోదు అయ్యే చాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే 6 వేల నుంచి 8 వేలకు చేరింది. వానాకాలం సీజన్ మొదలవడంతో కరోనా ఉధృతి పెరిగే అవకాశం కన్పిస్తోంది.
గత 24 గంటల్లో మహారాష్ట్రలో 2487, ఢిల్లీలో 1295, తమిళనాడులో 1149, ఏపీలో 110, తెలంగాణలో 199 కేసులు బయటపడ్డాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో కేసులు పెరిగేతే కరోనా కంట్రోల్ చేయడం కష్టమని తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ఇతర రాష్ట్రాలతో రాకపోకలు నిలిపివేసింది. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే జూన్ 8 తర్వాత ఎలా ఉంటుంది అనేది ఆందోళన కల్గిస్తోంది.