Telugu Global
NEWS

4కోట్ల మందికి నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది- వైసీపీ ఎమ్మెల్యే అప్పలరాజు

ఇటీవల ఏపీలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు ఆవేదన చెందారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైకోర్టులు పలువురికి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆయనేమన్నారంటే ” కోర్టులపై వ్యాఖ్యలు చేసినందుకు ఎంపీ, ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇస్తున్నారు. సోషల్ మీడియా నెటిజన్లకు నోటీసులు ఇచ్చారు. ఈ మీడియా సమావేశం తర్వాత అందుకు నేను కూడా మినహాయింపు కాకపోవచ్చు. 2008లోనే ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్న న్యాయమూర్తులను సుప్రీం […]

4కోట్ల మందికి నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది- వైసీపీ ఎమ్మెల్యే అప్పలరాజు
X

ఇటీవల ఏపీలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు ఆవేదన చెందారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైకోర్టులు పలువురికి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు.

ఆయనేమన్నారంటే ” కోర్టులపై వ్యాఖ్యలు చేసినందుకు ఎంపీ, ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇస్తున్నారు. సోషల్ మీడియా నెటిజన్లకు నోటీసులు ఇచ్చారు. ఈ మీడియా సమావేశం తర్వాత అందుకు నేను కూడా మినహాయింపు కాకపోవచ్చు. 2008లోనే ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్న న్యాయమూర్తులను సుప్రీం కోర్టు మందలించింది. ఎన్నికల మేనిఫెస్టో అమలుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది… అయితే వాటిపై ఏదో ఒక ఆరోపణతో కేసులు వేస్తున్నారు. కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి. కోర్టు నిర్ణయాలతో మేం ఏకీభవించడం లేదు. కోర్టులకు మేం ఉద్దేశాలను ఆపాదించడం లేదు. కానీ ఇలాగే పరిస్థితి కొనసాగితే ప్రజలు కూడా కోర్టులకు ఉద్దేశాలు ఆపాదించే పరిస్థితి వస్తుంది. నాలుగు కోట్ల మందికి నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి రావొచ్చు. మేనిఫెస్టో అమలు చేసేందుకు ముందుకెళ్తుంటే ప్రత్యర్థులు, కోర్టులు అడ్డుకోవడం ఏంటి?. కోర్టుల పరిధి ఏంటి?. పరిపాలనలో కోర్టుల జోక్యం ఏంటి?.

ఇంగ్లీష్ మీడియంను, కార్యాలయాల తరలింపును అడ్డుకోవడం ఏంటి?. నేనూ డాక్టర్‌నే. మాకూ క్రమశిక్షణ ఉంటుంది. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే డాక్టర్‌ కాబట్టి చర్యలు తీసుకోకుండా పోలీసులు ఉంటారా?. డాక్టర్ కాబట్టి తాగి నడిరోడ్డుపై తందనాలు ఆడినా వెసులుబాటు ఇవ్వాలంటే ఎలా?. పెద్ద చదువులు చదివిన వారు న్యూసెన్స్ క్లియేట్ చేస్తున్నా ఏమీ అనకూడదా?. డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని… ఎడిటింగ్ చేసిన వీడియోలను ఇస్తే వాటి ఆధారంగా తీర్పులు ఇవ్వడాన్ని నేను ఏకీభవించడం లేదు.

లాక్‌డౌన్ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు నిత్యావసర సరుకులు అందజేస్తే సీబీఐ విచారణకు ఆదేశిస్తామన్నారు. మరి చంద్రబాబు లోకేష్ జాతరలాగా వస్తే దాన్ని ఎందుకు సుమోటోగా స్వీకరించడం లేదు. చంద్రబాబుపై పిటిషన్‌ వేస్తే బ్రహ్మాండమైన మాటను కోర్టు చెప్పింది. వైసీపీ ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ వేస్తామన్న కోర్టు చంద్రబాబు విషయంలో మాత్రం విపత్తు నిర్వాహణ అధికారికి ఫిర్యాదు చేసుకోమనడం ఏమిటి?. ప్రత్యర్థులు తెల్లకాగితంపై లేఖలు రాస్తే, ఎడిటింగ్‌ వీడియోలతో పిటిషన్లు వేస్తే విచారణకు ఆదేశిస్తున్నారు.

మేం బ్రహ్మాండమైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే పక్కన పెడుతున్నారు. దీనిపై చర్చ జరుగుతోంది. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు కోర్టులు ఎక్కడికి వెళ్లాయి?. లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించినప్పుడు కోర్టులు ఎక్కడికి వెళ్లాయి ?. పర్యావరణాన్ని నాశనం వేసి వేలాది ఎకరాల్లో అమరావతి వెంచర్ వేసినప్పుడు కోర్టులు ఎక్కడికి వెళ్లాయి?.. నాయకుల ప్రచార పిచ్చి వల్ల పదుల సంఖ్యలో సామాన్యులు చనిపోతే కోర్టులు ఎక్కడికి వెళ్లాయి?. అని వైసీపీ ఎమ్మెల్యే అప్పలరాజు ప్రశ్నించారు.

First Published:  31 May 2020 10:43 PM GMT
Next Story