Telugu Global
NEWS

నెటిజన్లపై చర్యలకు ఏపీ ఏజీ లిఖితపూర్వక ఆమోదం

డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగిచండాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో కొందరు తీవ్ర పదజాలంతో జడ్జిపై విమర్శలు చేశారు. తీర్పును విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. వీటిని ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. నెటిజన్లు న్యాయమూర్తులను విమర్శించిన వ్యవహారంపై భారీగా ఫిర్యాదులు రావడంతో హైకోర్టు రిజిస్ట్రార్‌ వాటిని ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచారు. వాటిపై చర్చించేందుకు ప్రధాన న్యాయమూర్తి సోమవారం న్యాయమూర్తులందిరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరు ఎలాంటి పోస్టులు పెట్టారన్న దానిపై చర్చించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన […]

నెటిజన్లపై చర్యలకు ఏపీ ఏజీ లిఖితపూర్వక ఆమోదం
X

డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగిచండాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో కొందరు తీవ్ర పదజాలంతో జడ్జిపై విమర్శలు చేశారు. తీర్పును విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. వీటిని ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

నెటిజన్లు న్యాయమూర్తులను విమర్శించిన వ్యవహారంపై భారీగా ఫిర్యాదులు రావడంతో హైకోర్టు రిజిస్ట్రార్‌ వాటిని ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచారు. వాటిపై చర్చించేందుకు ప్రధాన న్యాయమూర్తి సోమవారం న్యాయమూర్తులందిరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరు ఎలాంటి పోస్టులు పెట్టారన్న దానిపై చర్చించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అని న్యాయమూర్తులంతా డిమాండ్ చేశారు. దాంతో ఈ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

మంగళవారం జేకే మహేశ్వరి, జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల సందర్భంగా ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరాం మాట్లాడుతూ… సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు చూస్తుంటే న్యాయవ్యవస్థపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని అర్థమవుతోందని… ఏజీ శ్రీరాం వ్యాఖ్యానించారు.

న్యాయవ్యవస్థకు మరకలు అంటించే ఇలాంటి వ్యాఖ్యలను సహించకూడదని…. కాబట్టి న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేసిన వారిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు ప్రభుత్వం తరపున తాను లిఖితపూర్వకంగా ఆమోదం తెలుపుతున్నట్టు కోర్టుకు వివరించారు.

ఏజీ లిఖితపూర్వక ఆమోదాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు… వైసీపీ ఎంపీ నందిగామ సురేష్‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ నేత రవిచంద్రారెడ్డితో పాటు మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌ 16కి వాయిదా వేసింది.

First Published:  26 May 2020 7:51 PM GMT
Next Story