Telugu Global
NEWS

ఎన్టీఆర్‌ ఘాట్‌కు ముఖం చూపించలేకే కరకట్టకు బాబు...!

కరోనా కారణం చూపుతూ రెండు నెలల పాటు హైదరాబాద్‌లోని తన ఇంటికే పరిమితమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హఠాత్తుగా ఇప్పుడు ఏపీకి వచ్చేశారు. ఇంకా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా డీజీపీ నుంచి అనుమతి తీసుకుని మరీ ఏపీకి వచ్చారు. మహానాడు వేళ చంద్రబాబు హఠాత్తుగా ఏపీకి రావడంపై చర్చ జరుగుతోంది. మహానాడు ఈసారి ఎలాగో జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్‌లోనే ఉంటారని భావించారు. అనుమతి తీసుకుని వెళ్లి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తారని […]

ఎన్టీఆర్‌ ఘాట్‌కు ముఖం చూపించలేకే కరకట్టకు బాబు...!
X

కరోనా కారణం చూపుతూ రెండు నెలల పాటు హైదరాబాద్‌లోని తన ఇంటికే పరిమితమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హఠాత్తుగా ఇప్పుడు ఏపీకి వచ్చేశారు. ఇంకా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా డీజీపీ నుంచి అనుమతి తీసుకుని మరీ ఏపీకి వచ్చారు. మహానాడు వేళ చంద్రబాబు హఠాత్తుగా ఏపీకి రావడంపై చర్చ జరుగుతోంది. మహానాడు ఈసారి ఎలాగో జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్‌లోనే ఉంటారని భావించారు. అనుమతి తీసుకుని వెళ్లి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తారని భావించారు. కానీ చంద్రబాబు కరకట్టపైకి చేరిపోయారు.

గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద నివాళులర్పించే విషయంలో చంద్రబాబు ఆసక్తి చూపడం లేదు. ఇది వరకు ఏపీ సీఎంగా ఉండడం వల్ల బీజీగా ఉండి హైదరాబాద్‌ వెళ్లి ఎన్టీఆర్ ఘాట్‌కు నివాళులర్పించలేదని భావించారు. కానీ ఈసారి తీరా ఎన్టీఆర్‌ జయంతి నాడు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉన్నా… ఘాట్‌ వద్దకు వెళ్లి నివాళులర్పించే అవకాశం ఉన్నా చంద్రబాబు కరకట్టకు వచ్చేశారు.

ఒక శక్తిగా ఎన్టీఆర్‌ తయారు చేసిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు చంద్రబాబునాయుడు… కనిష్టస్థాయికి తెచ్చారని… రాజ్యసభలో ఉనికి కోల్పోవడం, నేడోరేపో ప్రతిపక్ష హోదా కూడా ఏపీలో కోల్పోయే పరిస్థితి ఉండడం, ఇప్పటికే తెలంగాణలో దుకాణం మూసివేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్‌ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించేందుకు ముఖం చెల్లకే చంద్రబాబు ఇలా ఏపీకి వెళ్లిపోయారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

తన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్‌ ఇమేజ్‌ మ్యాచ్‌ అవడం లేదని, ఎన్టీఆర్ ఇమేజ్‌ తనకు పనికి వచ్చే అవకాశం కూడా లేదన్న నిర్ధారణకు చంద్రబాబు రావడం కూడా ఇలా ఘాట్‌ వద్ద నివాళులర్పించేందుకు ఆసక్తి చూపకపోవడానికి మరో కారణమని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు కెమెరాలు ఆఫ్‌లో ఉన్నాయని భావించి… కెమెరా ముందే… పార్టీపై ఎన్టీఆర్ ముద్రను తొలగించాల్సిందిగా ఒక మీడియా అధినేత ఇచ్చిన సలహాను చంద్రబాబు ఫాలో అవుతున్నట్టుగా భావిస్తున్నారు.

First Published:  26 May 2020 4:25 AM GMT
Next Story