Telugu Global
NEWS

కూత తగ్గని కూన... తహసీల్దార్‌కు లంచం ఆఫర్

శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి రెచ్చిపోయారు. అధికారం పోయినా సరే నియోజకవర్గంలో తాను చెప్పిందే నడవాలని అధికారులను బెదిరిస్తున్నారు. ఇప్పటికే ఒక ఎంపీడీఓను, మరో అధికారిని బూతులు తిడుతూ బెదిరించిన కేసులో కూన రవికుమార్ రెండు సార్లు అరెస్ట్ అయ్యారు. అయినా పద్దతి మారలేదు. తాజాగా పొందూరు తహసీల్దార్‌ తామరాపల్లి రామకృష్ణను బెదిరించారు కూన రవికుమార్. కూన రవికుమార్ సోదరుడు ఇప్పటికీ చెరువుల్లోని మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈనెల 16న […]

కూత తగ్గని కూన... తహసీల్దార్‌కు లంచం ఆఫర్
X

శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి రెచ్చిపోయారు. అధికారం పోయినా సరే నియోజకవర్గంలో తాను చెప్పిందే నడవాలని అధికారులను బెదిరిస్తున్నారు.

ఇప్పటికే ఒక ఎంపీడీఓను, మరో అధికారిని బూతులు తిడుతూ బెదిరించిన కేసులో కూన రవికుమార్ రెండు సార్లు అరెస్ట్ అయ్యారు. అయినా పద్దతి మారలేదు. తాజాగా పొందూరు తహసీల్దార్‌ తామరాపల్లి రామకృష్ణను బెదిరించారు కూన రవికుమార్.

కూన రవికుమార్ సోదరుడు ఇప్పటికీ చెరువుల్లోని మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈనెల 16న గోరింట గ్రామంలోని చెరువులో కూన రవికుమార్ సోదరుడు రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లు ఏర్పాటు చేసి మట్టిని తరలించేందుకు సిద్ధమవుతుండగా సమాచారం అందుకున్న తహసీల్దార్ అక్కడికి చేరుకుని వాహనాలను సీజ్ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న కూన రవికుమార్‌… తహసీల్దార్‌కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. సీజ్‌ చేసిన వాహనాలను తక్షణం వదిలిపెట్టకపోతే… లంచం డిమాండ్ చేశావంటూ నీపైనే కేసు పెడుతా అంటూ తహసీల్దార్‌ను బెదిరించాడు.

‘నా చేతిలో ఏం లేదు. సీజ్‌ చేసి అప్పగించేశాను’ అని తహసీల్దార్‌ చెప్పడంతో.. ‘కూన’ దుర్భాషలాడుతూ.. ‘నువ్వు సీజ్‌ చేశావుగానీ కంప్లైంట్‌ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి.. పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ‘నిబంధనల ప్రకారం వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు అప్పగించాను. తర్వాత మీరు రిలీజ్‌ చేసుకోండి సార్‌’ అని తహసీల్దార్‌ చెప్పడంతో.. ‘ప్రాసెస్‌ గురించి నాకు చెబుతున్నావా..’ అంటూ రాయలేని రీతిలో ‘కూన’ అసభ్యంగా దూషించారు.

కూన రవికుమార్ అధికారిని హెచ్చరించిన ఆడియో టేపు ఇప్పుడు బయటకు వచ్చింది. దీంతో తహసీల్దార్ తన మాట వినకపోవడంతో కూన రవికుమార్ మరో ప్లాన్ వేశాడు. క్వారంటైన్‌లో ఉన్న 13మంది టీడీపీ కార్యకర్తలతో తహసీల్దార్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయించాడు.

First Published:  25 May 2020 1:00 AM GMT
Next Story