Telugu Global
National

తాగి వీరంగం వేయడం సుధాకర్ తప్పు కాదు... లిక్కర్ తప్పు " కొత్త పుంతలు తొక్కుతున్న మీడియా

మీడియాలో విలువలు శరవేగంగా పతనమవుతున్నాయి. రాజకీయ పార్టీల అధికార ప్రతినిధుల తరహాలో మీడియాలో కొందరు ఫీల్ అవుతుండడంతో విపరీత వాదనలు తెరపైకి వస్తున్నాయి. విశాఖలో మత్తు డాక్టర్ సుధాకర్ మందు కొట్టి నడిరోడ్డుపై వీరంగం సృష్టించడాన్ని సమర్థించే వారు కూడా వచ్చేశారు. టీవీ5 చానల్‌ ఈ విషయంలో సుధాకర్‌కు మద్దతుగా నిలిచింది. మద్యం మత్తులో వీరంగం చేస్తే అది ఆయన తప్పు ఎలా అవుతుంది…. అయితే లిక్కర్ తప్పు అవుతుంది…లేదంటే దాన్ని అమ్మిన ప్రభుత్వానిది తప్పు అవుతుందని […]

తాగి వీరంగం వేయడం సుధాకర్ తప్పు కాదు... లిక్కర్ తప్పు   కొత్త పుంతలు తొక్కుతున్న మీడియా
X

మీడియాలో విలువలు శరవేగంగా పతనమవుతున్నాయి. రాజకీయ పార్టీల అధికార ప్రతినిధుల తరహాలో మీడియాలో కొందరు ఫీల్ అవుతుండడంతో విపరీత వాదనలు తెరపైకి వస్తున్నాయి.

విశాఖలో మత్తు డాక్టర్ సుధాకర్ మందు కొట్టి నడిరోడ్డుపై వీరంగం సృష్టించడాన్ని సమర్థించే వారు కూడా వచ్చేశారు. టీవీ5 చానల్‌ ఈ విషయంలో సుధాకర్‌కు మద్దతుగా నిలిచింది. మద్యం మత్తులో వీరంగం చేస్తే అది ఆయన తప్పు ఎలా అవుతుంది…. అయితే లిక్కర్ తప్పు అవుతుంది…లేదంటే దాన్ని అమ్మిన ప్రభుత్వానిది తప్పు అవుతుందని ఆ చానల్‌ ప్రశ్నిస్తోంది. చానల్‌ యాంకర్ సాంబశివరావు… ఇదే రీతిలో ప్రశ్నించారు.

” ఒకవేళ సుధాకర్ తాగడం తప్పు అయితే… తాగితే మత్తు వస్తున్నట్టు అయితే… తాగడానికి షాపులు తెరిచింది ఎవరు?. అమ్మింది ఎవరు?. ప్రభుత్వమే అమ్ముతోంది కదా… మరి నేరం చేసింది ఎవరు?. తాగిన వారు ఎప్పుడూ బాధితులే కదా!. తాగడానికి అవకాశం ఇచ్చింది ఎవరు?. డబ్బు చేసుకుంటున్నది ఎవరు?. మరి వారికేం శిక్షలుండవా? ” అని యాంకర్ సాంబశివరావు ప్రశ్నించారు.

తాగిన వాడు ఎప్పుడూ బాధితుడే… మద్యం తాగితే మత్తు వస్తుందంటే అది అమ్మిన వారిదే తప్పు అంటూ యాంకర్ చేసిన వాదనతో చాలా మంది దిగ్బ్రాంతి చెందారు.

సాంబశివరావు వాదనపై తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌, సీనియర్ జర్నలిస్ట్ బుద్దా మురళీ తనదైన శైలిలో స్పందించారు. సాంబశివరావు పేరు ప్రస్తావించకుండానే సెటైర్లు వేశారు.

”కత్తితో ఇతను కసా కసా పొడిచి చంపాడు ..
ఆ కత్తి దేనితో చేశారు ?
ఇనుము తో …
ఐతే ఇనుప ఖనిజాన్ని తొవ్వి తీయడానికి అనుమతి ఇచ్చింది ఎవరు ?
కాంట్రాక్టర్ ఎవరు ?
తవ్విన కూలీ ఎవరు ?
ఆ ఇనుముతో కత్తి చేసింది ఎవరు ?
అమ్మింది ఎవరు ?
వారి పై కేసు పెట్టి ఇతన్ని వదలాలి
(మా ఛానల్ మా ఇష్టం)” అంటూ బుద్దా మురళీ సునిశిత విమర్శ చేశారు.

First Published:  24 May 2020 1:09 AM GMT
Next Story