సీజ్ అయిన వాహనాల యజమానులకు గుడ్ న్యూస్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహనదారులకు శుభవార్త చెప్పారు. కరోనా కారణంగా… లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేశారు. గత రెండు నెలలుగా పలు వాహనాలు పోలీస్ స్టేషన్లలోనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని విడుదల చేయాలని పోలీస్ శాఖను సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసే సమయంలో వాహనదారుల నుంచి కేవలం రూ. 100 మాత్రమే ఫైన్ తీసుకోవాలని.. అంతే కాకుండా […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహనదారులకు శుభవార్త చెప్పారు. కరోనా కారణంగా… లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేశారు.
గత రెండు నెలలుగా పలు వాహనాలు పోలీస్ స్టేషన్లలోనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని విడుదల చేయాలని పోలీస్ శాఖను సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసే సమయంలో వాహనదారుల నుంచి కేవలం రూ. 100 మాత్రమే ఫైన్ తీసుకోవాలని.. అంతే కాకుండా మరోసారి నిబంధనలు ఉల్లంఘించమనే హామీ పత్రాన్ని కూడా రాయించుకోవాలని చెప్పారు. గత రెండు నెలల కాలంలో సీజైన వాహనాలన్నీ మధ్య, దిగువ మధ్య తరగతుల వారికి చెందినవే. వీరిలో కొందరు చిరు వ్యాపారులు కూడా ఉన్నారు.
సాధారణంగా సీజ్ చేసిన వాహనాన్ని కోర్టుల ద్వారా జరిమానా కట్టి విడిపించుకోవాల్సి ఉంటుంది. కానీ కోవిడ్-19 సంక్షోభ సమయంలో కోర్టులు విధించే భారీ జరిమానాల నుంచి రక్షించడానికి సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
వాహనాలు విడుదల చేసే సమయంలో సదరు వాహనదారుడికి కోవిడ్-19పై అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారుల చేత క్లాస్ చెప్పించాలని కూడా సీఎం సూచించారు. ఇప్పటికే వాహనాలు విడుదల చేస్తామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా స్పష్టం చేశారు. అయితే జరిమానాలు ఎంత భారీగా ఉంటాయో అని భయపడిన వారికి సీఎం జగన్ ఆదేశాలు ఊరట కలిగించాయి.