Telugu Global
NEWS

విశాఖకు దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం

విశాఖను పరిపాలన రాజధానిగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు భవనాలను అన్వేషిస్తున్నారు. కొన్ని నెలలు ఆలస్యం అయినా రాజధాని తరలింపు ఖాయమని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి కూడా అదే తరహా సంకేతాలు రావడంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కూడా ప్రధాన కార్యాలయం కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయాన్ని సింహాచలం ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సింహాచలం దేవాస్థానం మాస్టర్ ప్లాన్‌లో […]

విశాఖకు దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం
X

విశాఖను పరిపాలన రాజధానిగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు భవనాలను అన్వేషిస్తున్నారు. కొన్ని నెలలు ఆలస్యం అయినా రాజధాని తరలింపు ఖాయమని అధికారులు భావిస్తున్నారు.

ప్రభుత్వ పెద్దల నుంచి కూడా అదే తరహా సంకేతాలు రావడంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కూడా ప్రధాన కార్యాలయం కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయాన్ని సింహాచలం ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సింహాచలం దేవాస్థానం మాస్టర్ ప్లాన్‌లో భాగంగా సుమారు 4 ఎకరాల్లో కల్యాణమండపాలు, డార్మిటరీ కమ్ షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్వహిస్తున్నారు. ఈ సువిశాలమైన భవనాన్ని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంగా మార్చేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు దాదాపు నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా భవనంలో మార్పులు చేయనున్నారు.

ప్రధాన కార్యాలయానికి తగ్గట్టుగా పూర్తి స్థాయి ఫర్నీచర్‌ కొనుగోలు చేయాలని సింహాచలం దేవస్థానం అధికారులకు ఆదేశాలు కూడా అందాయి.

First Published:  23 May 2020 7:22 PM GMT
Next Story