Telugu Global
Cinema & Entertainment

పుకార్లు ఖండించిన సత్యదేవ్

ఈ లాక్ డౌన్ టైమ్ లో సినిమా అప్ డేట్స్ కంటే హీరోహీరోయిన్లకు సంబంధించిన పుకార్లే ఎక్కువగా షికారు చేస్తున్నాయి. ఈ లిస్ట్ లోకి తాజాగా సత్యదేవ్ కూడా చేరిపోయాడు. హీరోగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఈ హీరో.. తనపై వచ్చిన ఓ పుకారుకు ఉక్కిరిబిక్కిరయ్యాడు. అది అతడి కెరీర్ నే దెబ్బతీసే ప్రమాదం ఉండడంతో వెంటనే క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ సత్యదేవ్ పై వచ్చినే పుకారు ఏంటో తెలుసా.. అతడు త్వరలోనే యాక్టింగ్ మానేస్తాడట, మెగా ఫోన్ […]

పుకార్లు ఖండించిన సత్యదేవ్
X

ఈ లాక్ డౌన్ టైమ్ లో సినిమా అప్ డేట్స్ కంటే హీరోహీరోయిన్లకు సంబంధించిన పుకార్లే ఎక్కువగా షికారు చేస్తున్నాయి. ఈ లిస్ట్ లోకి తాజాగా సత్యదేవ్ కూడా చేరిపోయాడు. హీరోగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఈ హీరో.. తనపై వచ్చిన ఓ పుకారుకు ఉక్కిరిబిక్కిరయ్యాడు. అది అతడి కెరీర్ నే దెబ్బతీసే ప్రమాదం ఉండడంతో వెంటనే క్లారిటీ ఇచ్చాడు.

ఇంతకీ సత్యదేవ్ పై వచ్చినే పుకారు ఏంటో తెలుసా.. అతడు త్వరలోనే యాక్టింగ్ మానేస్తాడట, మెగా ఫోన్ పట్టుకుంటాడట. ఈ మేరకు 5-6 కథలు కూడా రాసుకున్నాడట. ఇది అతడిపై వచ్చిన రూమర్. తనపై ఇలాంటి గాసిప్ రావడంతో వెంటనే సత్యదేవ్ రియాక్ట్ అయ్యాడు. తనకు నటించడమంటే ప్రాణమని, నటనకే తన తొలి ప్రాధాన్యమని స్పష్టంచేశాడు.

నిజానికి ఓ ఇంటర్వ్యూలో తను కొన్ని స్టోరీలు కూడా రాసుకున్నానని, డైరక్షన్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు సత్యదేవ్. దాన్ని కొన్ని వెబ్ సైట్లు తిప్పిరాశాయి. దీంతో ఇంటర్వ్యూలో తను చెప్పిన మేటర్ పై సత్యదేవ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎప్పటికీ యాక్టింగ్ ను వదిలిపెట్టేది లేదని క్లారిటీ ఇచ్చాడు ఈ నటుడు. సత్యదేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా.. థియేటర్లు తెరిచిన వెంటనే రిలీజ్ అవుతుంది.

First Published:  21 May 2020 11:30 PM GMT
Next Story