Telugu Global
NEWS

జ్యుడీషియల్‌ ఉద్యోగుల జీతాల్లో కరోనా కోత అంగీకరించం " హైకోర్టు

కరోనా కారణంగా మొత్తం వ్యవస్థ స్తంభించిపోయి ఆదాయం పడిపోవడంతో ఇటీవల చాలా రాష్ట్రాలు ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టాయి. ఏపీ ప్రభుత్వం కూడా ఏప్రిల్ నెలలో సగం జీతం అందజేసింది. మిగిలిన మొత్తం తర్వాత చెల్లిస్తామని వెల్లడించింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు కోర్టులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు. జీతంలో కోత పెట్టడాన్ని వ్యతిరేకించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు… మా అనుమతి లేకుండా జ్యుడీషియల్ ఉద్యోగుల జీతాల్లో […]

జ్యుడీషియల్‌ ఉద్యోగుల జీతాల్లో కరోనా కోత అంగీకరించం  హైకోర్టు
X

కరోనా కారణంగా మొత్తం వ్యవస్థ స్తంభించిపోయి ఆదాయం పడిపోవడంతో ఇటీవల చాలా రాష్ట్రాలు ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టాయి. ఏపీ ప్రభుత్వం కూడా ఏప్రిల్ నెలలో సగం జీతం అందజేసింది. మిగిలిన మొత్తం తర్వాత చెల్లిస్తామని వెల్లడించింది.

అయితే దీన్ని సవాల్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు కోర్టులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు. జీతంలో కోత పెట్టడాన్ని వ్యతిరేకించారు.

ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు… మా అనుమతి లేకుండా జ్యుడీషియల్ ఉద్యోగుల జీతాల్లో కోత ఎలా విధిస్తారు… మీకు ఆ అధికారం ఎక్కడ ఉందని ప్రశ్నించింది. రేపు మా జీతాల్లోనూ ఇలాగే కోత పెడతారా? అని జడ్జిలు ప్రశ్నించారు. జీతాల కోత నుంచి పిటిషనర్‌ విషయంలో జీవో అమలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. జ్యుడీషియల్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రారని… వారి జీతాలు కత్తిరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు.

ప్రభుత్వ తరపు న్యాయవాది మాత్రం తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని వివరించారు. జిల్లా న్యాయవ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అనుగుణంగానే ఉంటుందని మాన్యువల్‌ను చదివి వినిపించారు. ప్రభుత్వ వాదన పట్ల కోర్టు సంతృప్తి చెందలేదు. కరోనా కటింగ్ నుంచి పిటిషనర్‌ జీతానికి మినహాయింపు ఇచ్చింది.

First Published:  19 May 2020 8:50 PM GMT
Next Story