Telugu Global
CRIME

వలస విషాదం... రెండు ట్రక్కులు ఢీకొని 23 మంది దుర్మరణం

దేశంలో వలస కూలీల విషాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో లాక్‌డౌన్ విధించడంతో పనులు లేక ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది సొంతూర్లకు బయలుదేరారు. కాలినడక, శ్రామిక్ రైలు, బస్సు, ట్రక్కు ఇలా ఏది దొరికితే దాంట్లో వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ నుంచి తమ సొంతూర్లకు ట్రక్కులో వెళ్తున్న వలస కూలీలను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఔరాయి సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 23 మంది […]

వలస విషాదం... రెండు ట్రక్కులు ఢీకొని 23 మంది దుర్మరణం
X

దేశంలో వలస కూలీల విషాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో లాక్‌డౌన్ విధించడంతో పనులు లేక ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది సొంతూర్లకు బయలుదేరారు.

కాలినడక, శ్రామిక్ రైలు, బస్సు, ట్రక్కు ఇలా ఏది దొరికితే దాంట్లో వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ నుంచి తమ సొంతూర్లకు ట్రక్కులో వెళ్తున్న వలస కూలీలను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఔరాయి సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 23 మంది మృతి చెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్‌కు పలు పనుల నిమిత్తం వలసవెళ్లిన కూలీలు ఉత్తరప్రదేశ్‌కు ఒక ట్రక్కులో వస్తుండగా ఎదురుగా వచ్చిన మరో ట్రక్కు బలంగా ఢీకొంది. దీంతో 23 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మృతులు, బాధితులు బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బంగాల్‌కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. కాగా, వలస కూలీలను శ్రామిక్ రైళ్లు లేదా ప్రత్యేక బస్సుల ద్వారా మాత్రమే తరలించాలని కేంద్ర హోం శాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఘోర దుర్ఘటన జరగడం గమనార్హం.

మరోవైపు నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి సమీపంలో ఆగి ఉన్న టిప్పర్‌ను స్కార్పియో ఢీకొనడంతో ముగ్గురు కేరళ వాసులు మృతి చెందారు. బీహార్‌లో ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తున్న ఒక కుటుంబం కేరళలోని స్వగ్రామానికి స్కార్పియోలో బయలుదేరారు. శనివారం ఉదయం డిచ్‌పల్లి సమీపంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

ఇక మేడ్చెల్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గొరఖ్‌పూర్‌కు వలస కూలీలను తీసుకెళ్తున్న ట్రక్ నిర్మల్ జిల్లాలో బోల్తా పడింది. ఈ ఘటనలో 19 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

First Published:  15 May 2020 10:13 PM GMT
Next Story